అరుణ్‌సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం

నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్వర్యంలో అరుణ్‌సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది . ఈ సందర్భంగా ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా విభాగాలలో విజేతలకు అవార్డులు అందజేసారు. “అరుణ్‌సాగర్ సాహితి 2017 అవార్డు” గోరటి వెంకన్న  అందుకున్నారు.
మంత్రి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. అరుణ్ సాగర్ పేరుతో టీవీ5 యజమాన్యంవారు ఈ అవార్డు అందించడం ఆనందంగా  ఉందని అన్నారు.జర్నలిస్టులు మృతిచెందితే యాజమాన్యాలు తూతూ మంత్రంగా వ్యవహరిస్తారు కానీ టి.వి 5 వారు ఇలాంటి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామం అన్నారు. జర్నలిస్టులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి అన్నారు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
‘మీడియా అకాడమీ’ ఛైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ…. ఈ అవార్డుల ఎంపికకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ కే. రామచంద్రమూర్తి, ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కే .శ్రీనివాస్.. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారని  తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి విప్ పల్లారాజేశ్వర్‌రెడ్డి ,ఎం.ఎల్ ఏ వెంకటేశ్వర రెడ్డి గారు తదితరులు  పాల్గొన్నారు.