‘ఇంకేం కోరుకోకు’ అని అమ్మకు చెప్పా !

‘‘నాకంటూ ఎలాంటి కోరికలూ లేవు. ఫలానా పాత్ర చేయాలి, ఫలానా కథలో నటించాలనే జాబితా లేదు. కానీ మా అమ్మకు మాత్రం నన్ను చాలా రకాల పాత్రల్లో చూడాలని ఉంది’’ అంటోంది అనుష్క. ప్రస్తుతం ‘భాగమతి’లో నటిస్తోంది స్వీటీ. ఈ యేడాదే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనుష్క మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో వూహించని పాత్రలెన్నో నన్ను వెతుక్కొంటూ వచ్చాయి. అయితే అవేం నేను కోరుకోలేదు. మా అమ్మ మాత్రం నన్ను ‘యువరాణి’ లాంటి పాత్రల్లో చూడాలని ఉంది అని చెప్పేది. అదేంటో తను ఏం అనుకొంటే అది జరిగిపోతుంటుంది.

అందుకే ‘రుద్రమదేవి’, ‘అరుంధతి’లాంటి చిత్రాల్లో యువరాణి పాత్రల్లో కనిపించగలిగా. ఇప్పుడు ‘చేపలు పట్టే అమ్మాయి’ పాత్రలో చూడాలనుకొంటోందట. ఏమో… ఇది కూడా జరిగిపోవొచ్చు. ‘నువ్వేం అనుకొంటే అది జరిగిపోతోంది… ఇంకేం కోరుకోకు’ అని అమ్మకు చాలా సార్లు చెప్పా. మున్ముందు ఇంకేం కోరుకొంటుందో చూడాలి’’ అంటోంది. త్వరలోనే  అనుష్క పెళ్లికూతురు కానుందని … అందుకే సినిమాలు తగ్గించుకుంటోందని చెప్పుకుంటున్నారు .