అరవిందస్వామి ‘భాస్కర్ ఒక రాస్కెల్’ టీజర్ ఆవిష్కరణ

‘భాస్కర్ ఒక రాస్కెల్’ గా తమిళ ‘భాస్కర్ ఓరు రాస్కెల్’ ఇప్పడు తెలుగులో వస్తోంది. కార్తికేయ మూవీస్ పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల . అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలు ….సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ముఖ్య పాత్ర. సిద్ధికీ దర్శకత్వం.ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. వి.సముద్ర, దామోదరప్రసాద్ (దాము) టీజర్ విడుదల చేసారు.
వి.సముద్ర మాట్లాడుతూ… “తమిళ, మలయాళ సినీ రంగాలలో పేరున్న సిద్దికీ ఈ చిత్రానికి దర్శకత్వం చేసారు . ఆ రెండు బాషలలో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. యాక్షన్.. సెంటిమెంట్ అంశాలను మిళితం చేసి దీనిని మలిచారు” అని చెప్పారు.
కె.యల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..” కుటుంబ కధ తో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ‘నిర్మాతల మండలి ‘ తరఫున నూతన నిర్మాతలకు చిత్ర నిర్మాణం పట్ల అవగాహన కల్పించే క్లాసులు నిర్వహిస్తున్నాం” అన్నారు.
లగడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ…మంచి అభిరుచితో పఠాన్ చాన్ బాషా సినిమా రంగంలోనికి వచ్చారని అన్నారు.
మంచి కధా బలమే సినిమాకు ప్రాణమని.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుగోపాల్ యాదవ్ అన్నారు.
చిత్ర నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ.. “ఎవరూ లేని ఇద్దరు వ్యక్తులు కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఏం చేసారు? అన్న ఆసక్తి దాయకమైన అంశంతో ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది అన్నారు. ఇందులోని ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని” చెప్పారు. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారని , అమ్రిష్ గణేష్ సమకూర్చిన సంగీతం అలరిస్తుందని చెప్పారు.
ఈ చిత్రంలో నాజర్, నికీషా పటేల్, రోబో శంకర్ తదితరులు నటీనటులు .