ప్రేక్షకుల విజయం “టిక్ టిక్ టిక్”

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘టిక్ టిక్ టిక్’. గత శక్రవారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్ ను అందుకున్నారు‌ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై లక్ష్మణ్ చదలవాడ , చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ ను ఫిలిం చాంబర్ లొ ఏర్పాటు చేశారు‌.
దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల మీద నమ్మకంతో ఇలాంటి ఓ స్పేస్ ఫిలిం ను తీశాం. వారు మా  నమ్మకాన్ని వమ్ము చెయలేదు. లక్ష్మణ్ గారి భారీగా విడుదల చెశారు‌. వారికి ధన్యవాదాలన్నారు.
జయం రవి మాట్లాడుతూ.. ఇదొక కొత్త ప్రయత్నం. సక్సెస్ చెసి మాకు ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎంకరేజ్ చేసారు.తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది ఫ్రేండ్స్ ఉన్నారు. ఇప్పుడు టిక్ టిక్ టిక్ సక్సెస్ తో డబుల్ హ్యాపీ గా ఉన్నాను. లక్ష్మణ్ గారు ఈ చిత్రాన్ని భారీగా విడుదల చెశారు‌.మంచి పబ్లిసిటీ కూడా చెస్తున్నారన్నారు. త్వరలొ తెలుగు సినిమా కూడా చెస్తానన్నారు. ఈ సినిమా మేకింగ్ కొసం ఎంతో కష్టపడ్డాం‌.  చిత్ర విజయం అదంతా మరిచిపొయెలా చేసింది.సిజి వర్క్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మా నిర్మాతలు గట్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమాన్ గారి బిజి కూడా ఈ సినిమా సక్సెస్ లొ ప్రధానబలం. నా కొడుకు ఆరవ్ కూడా ఈ సినిమాతో పరిచయమవటం ఆనందంగా ఉందన్నారు.
లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ..టిక్ టిక్ టిక్ ప్రేక్షకుల విజయం .జెన్యూన్ మౌత్ టాక్ తో ఈ సినిమా ఆడుతోంది‌. సౌత్ ఇండియా నుంచి ఈ తరహా సినిమా రావటం మనందరికి గర్వకారణం. మా బ్యానర్ లొ వరుసగా మూడొ చిత్రాన్ని  సక్సెస్ చెసిన ఆడియెన్స్ కు దన్యవాదాలు. కామన్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నారు.