‘ఐఎండీబీ'(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు 2017 సంవత్సరంలో ప్రజలకు బాగా చేరువైన టాప్ 10 భారతీయ సినిమాల జాబితా ప్రకటించారు. ఇందులో రాజమౌళి తీర్చిదిద్దిన ‘బాహుబలి 2 ‘ రెండో స్థానంలో నిలవగా.. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాల కంటే ముందు వరుసలో (మొదటి స్థానంలో) మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా వచ్చిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ నిలిచింది. అయితే ఇక్కడ టాప్ 10 జాబితాలో మొదటి మూడు స్థానాల్లో రెండు తెలుగు సినిమాలు నిలవడం టాలీవుడ్ ఇండస్ట్రీని ఆనందపెడుతోంది….
1. విక్రమ్ వేద
2. బాహుబలి : ది కన్‌క్లూజన్
3. అర్జున్ రెడ్డి
4. సీక్రెట్ సూపర్ స్టార్
5. హిందీ మీడియం
6. ఘాజీ
7. టాయిలెట్ ఏక్‌ప్రేమ్‌కథ
8. జాలీ ఎల్.ఎల్.బి 2
9. మెర్సల్
10. ది గ్రేట్ ఫాదర్