మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో …..

“యంగ్ రెబ‌ల్ స్టార్” ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు సౌత్ కే ప‌రిమితం కాక నేష‌న‌ల్ వైడ్ గా పాకింది. “బాహుబ‌లి” సినిమాలో ప్ర‌భాస్ న‌ట విశ్వ‌రూపం ఇప్పుడు ఈ హీరోని నేష‌న‌ల్ స్టార్ గా మార్చింది. ప్ర‌భాస్ కోసం బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. అయితే రీసెంట్ గా ‘ఇండియా టుడే’ ఓ స‌ర్వే నిర్వ‌హించింది. 2016-2017 సంవ‌త్స‌రానికి గాను మోస్ట్ పాపుల‌ర్ హీరోలుగా ప‌లువురిని ఎంపిక చేసింది. అందులో ప్ర‌భాస్ టాప్ టెన్ లో చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. అమితాబ్ బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్ష‌య్ కుమార్ త‌ర్వాత ఐద‌వ స్థానంలో ప్ర‌భాస్ ఉన్నాడు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌య‌మేమంటే ‘మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ క‌న్నా టాప్ లో ప్ర‌భాస్ ఉన్నాడు. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘సాహో’ అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్ రీసెంట్ గా టీంతో క‌లిసాడు. ఈయ‌న‌పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.

‘సాహో’ అనే కొత్త యాక్షన్ ప్రపంచంలోకి ….

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ది కన్‌క్లూజన్ తరువాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. యువ దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ శుక్రవారం మొదలైంది. ఈ విషయాన్ని హీరో ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇట్స్ షూట్ టైమ్…”దాదాపు నాలుగున్నరేళ్ల ‘బాహుబలి’ ప్రయాణం తరువాత ‘సాహో’ అనే కొత్త యాక్షన్ ప్రపంచంలోకి ప్రవేశించడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలిసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధాకపూర్‌ను ఖరారు చేశారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మరింత స్టైలిష్‌గా కనిపించనున్న ఈ చిత్రం కోసం విదేశాల్లో పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారట. ఇందు కోసం హాలీవుడ్ స్టంట్‌మెన్ కెనీ బేట్ పనిచేస్తున్నారు. యూరప్‌తో పాటు అబుదాబి, రుమేనియా తదితర దేశాల్లో కీలక ఘట్టాల చిత్రీకరణ జరపనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నట్లు తెలిసింది.