మరోసారి భారీ యాక్షన్ సీన్స్ కోసం ప్రాక్టీస్

“బాహుబలి-2” సక్సెస్ తర్వాత అమెరికాలో హాలిడేస్ ఎంజాయ్ చేసొచ్చిన ప్రభాస్..ఇప్పుడు సాహోపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. బాహుబలి కోసం భారీ కసరత్తులు చేసిన ప్రభాస్ మరోసారి అదే పని చేస్తున్నాడు. “సాహో” యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రభాస్.సాహోలో చేయబోయే బడా యాక్షన్ సీక్వెన్సెస్‌కు సంబంధించిన రిహార్సల్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ లేకుండా హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన “సాహో” యూనిట్.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్లనుంది. అక్కడ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో గూడ్స్ ఖలీఫా దగ్గర భారీ యాక్సన్ ఏపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట.

 బాలీవుడ్‌లోనూ బాహుబలి తో  సూపర్  స్టార్‌గా మారిన ప్రభాస్ డేట్స్ కోసం ఎంతోమంది బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్  బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ షాజిద్   నడియాడ్ వాలా ఆధ్వర్యంలో  ఓసినిమా  చేస్తాడనే వార్త ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడిగానూ సల్మాన్ ఖాన్‌తో “కిక్” రూపొందించి..సూపర్ హిట్ అందుకున్నాడు షాజిద్ . తను ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ స్క్రిప్టు సిద్ధం చేయిస్తున్నాడట. ఒకవేళ ప్రభాస్ ఓకే అంటే..త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేయాలని చూస్తున్నాడట. మరి  త్వరలోనే ప్రభాస్ తొలి బాలీవుడ్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది ….