బాలయ్య నయనతార తో రవికుమార్ చిత్రం తొలి షెడ్యూల్

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 3 నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. “శ్రీరామరాజ్యం, సింహా” వంటి బ్లాక్ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బాలయ్య 100వ చిత్రమైన “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రానికి సంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ను నిర్మించాం. ఆగస్ట్ 3 నుండి 30 రోజులపాటు ఇక్కడే చిత్రీకరణ జరగనుంది, కీలకపాత్రధారులతో కీలకసన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ప్లాన్ చేస్తున్నారు” అన్నారు.

బాలకృష్ణ, నయనతార, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

NBK102, Nayantara, KS Ravikumar, C Kalyan Film First Schedule Details  

Nandamuri Balakrishna’s prestigious 102nd film NBK102 officially announced few weeks back in KS Ravikumar direction under C Kalyan production house CK Entertainments Pvt Ltd will begin its shooting from August 3rd at a specially erected setting in Ramoji Film City.

Meanwhile, Nayantara is zeroed as heroine besides Balakrishna while Prakashraj Jagapathi Babu, Murali Mohan, Brahmanandam are confirmed to play other lead roles.

“Committing a film with Balakrishna is a matter of prestige and repute for my banner CK Entertainments Pvt Ltd. Sensational director KS Ravikumar who made trendsetters with Rajinikanth, Kamal Haasan and other star heroes is helming a powerful story penned by M Ratnam.

NBK102 will remain as one of the best films in Balayya Babu’s career. We are making the film on uncompromised production values and high technical standards with a massive budget. To keep up the winning spirit and a positive super hit sentiment, we roped Nayantara as heroine besides Balakrishna repeating Sriramrajyam and Simha combination.

Balayya Babu’s characterization is written audaciously and his fans will love the look designed very carefully.

Star cameraman Ramprasad and talented music composer Chirantan Bhatt form the main technical crew.

A massive set is erected in Ramoji Film City for commencing the first schedule from August 3rd for 30 days. Key scenes involving the main cast will be shot here,” producer C Kalyan said.

Artists:Nandamuri Balakrishna, Nayantara, Prakash Raj, Jagapathi Babu, Murali Mohan, Brahmanandam, Prabhakar (Baahubali fame) and others.

Technical details:

Banner: CK Entertainments Pvt Ltd

Story, Dialogues: M Ratnam

Art Director: Narayana Reddy

Action: Arivumani, Anbumani

Camera: Ramprasad

Music: Chirantan Bhatt

Co-Producer: CV Rao

Executive Producer: Varun, Teja

Producer: C Kalyan

Director: KS Ravikumar