ఆమె ఎన్ని డిమాండ్లు పెట్టినా ఒప్పేసుకున్నారట

తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102వ సినిమాకు కూడా బాలయ్య ఓకే చెప్పారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో “పైసా వసూల్” సినిమా చేస్తున్నారు. ఆ వెంటనే మరో సినిమాకు కూడా కమిటయ్యారాయన. ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని డైరెక్టర్ కేఎస్ రవికుమార్ భావించారట. ఇప్పటికే బాలయ్యతో నయన్ “సింహా, “శ్రీరామరాజ్యం” సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకున్నాయి. బాలయ్యతో ఆమె జతకట్టడం ఇది మూడోసారి అవుతుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కూడా నయనతారనే హీరోయిన్‌గా తీసుకోవాలని రవికుమార్ అనుకున్నారట. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కేఎస్ రవికుమార్‌కు ఈ సక్సెస్‌ఫుల్ జోడీ సక్సెస్‌ను తీసుకొస్తుందేమోననే ఆశ కూడా ఉండొచ్చు
ఈ ప్రతిపాదనను ఆమె ముందు పెడితే …..సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకొన్నారు కానీ.. కొన్ని కండిషన్లు పెట్టారని టాక్. రూ.3 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. ఇక, ప్రమోషన్లు, ఇతర కార్యక్రమాలకు రానని తెగేసి చెప్పడం మరో డిమాండ్. ఆమె ఎన్ని డిమాండ్లు పెట్టినా సినిమా నిర్మాతలు ఒప్పుకొన్నారని అంటున్నారు. అయితే.. నయన్‌కు రూ.3 కోట్ల పారితోషికం ఇస్తే.. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న రెండో హీరోయిన్ నయన తార అవుతుందని అంటున్నారు.