అమ్రిత ప్రీతమ్ జీవిత చిత్రం లో ప్రియాంక

నటిగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా కేవలం నటనతోనే కాదు తన అంద చందాలతోను యూత్ ని విశేషం గా  ఆకట్టుకుంటోంది . ఇటీవల ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక ప్రస్తుతం కొన్ని బాలీవుడ్  చిత్రాల్లో  నటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రముఖ పంజాబీ రచయిత్రి అమ్రిత ప్రీతమ్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ ని రూపొందించాలని ప్లాన్ చేసాడట. ఈ క్రమంలో ప్రియాంకని లీడ్ రోల్ గా తీసుకోవాలని భావించాడట. ఇందుకోసం ఆమెతో చర్చలు కూడా జరిపాడని టాక్. ఈ ప్రాజెక్ట్ ప్రియాంకకి కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని సంజయ్ భావిస్తున్నట్టు సమాచారం. సంజయ్ ప్రస్తుతం ‘పద్మావతి’ చిత్రంతో బిజీగా ఉండగా , ప్రియాంక ‘ట్రాన్స్‌పరెంట్‌’ సిరీస్‌ చిత్రాల దర్శకుడు సిలాస్‌ హోవర్డ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. మరి ఇప్పటికే ‘మేరి కోమ్’ బయోపిక్ లో నటించి మెప్పించిన ప్రియాంక  ‘అమ్రిత ప్రీతమ్’ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంతోనూ కొంటుందనే ఆశిద్దాం