నటిగా సక్సెస్ లేకుంటే ఇక డైరెక్షనే !

నటి శాలిని చెల్లెలు, నటుడు అజిత్‌ మరదలు షామిలి బాల తారగా అద్భుత ప్రతిభను కనబరచిన విషయం తెలిసిందే. మచ్చుకు ‘అంజలి’ చిత్రం ఒక్కటి చాలు.. తన అభినయ ప్రతిభ గురించి చెప్పడానికి. బాల నటిగానే బహుభాషల్లో నటించి మెప్పించిన షామిలి ఆ తరువాత తన అభిరుచిని మార్చుకున్నారు. ఇప్పుడు షామిలికి నిర్మాత కావాలట. ఏమిటీ హీరోయిన్లు అవకాశాలు కావాలని కోరుకుంటారు గానీ, నిర్మాత కావాలని కోరుకుంటారా అన్న సందేహం మీకు రావచ్చు. అయితే షామిలి రూటు సెపరేటు అని చెప్పవచ్చు….
 
సినిమాకు సంబంధించిన విద్యను నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లిన షామిలి చెన్నైకి తిరిగొచ్చిన తరువాత మళ్లీ నటనపై దృష్టి సారించారు. తొలుత తెలుగులో నాయకిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ కెరీర్‌కు ఆ చిత్రం పెద్దగా హెల్ప్‌ అవ్వలేదు. ఆ తరువాత కోలీవుడ్‌లో విక్రమ్‌ప్రభుకు జంటగా ‘వీరశివాజీ’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం నిరాశనే మిగిల్సింది. దీంతో తాజాగా తెలుగులో నటిస్తూ మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అయితే షామిలి మనసులో దర్శకత్వం ఆలోచనలు తొలచేస్తున్నాయట. తాను నేర్చిన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ అమ్మడు ఇప్పటికే నాలుగైదు కథలను తయారు చేసుకున్నారట. ఈ సారి గనుక కథానాయకిగా సక్సెస్‌ కాకపోతే మెగాఫోన్‌ పట్టేస్తానంటున్నారని సమాచారం. అందుకు షామిలికి మంచి నిర్మాత కావాలట !