భరద్వాజ్ నాథూరాం గాడ్సే ‘మరణ వాగ్మూలం’

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ హంతకుడుగా నాథూరాం గాడ్ సే అందరికి తెలుసు. స్వాతంత్ర్య అనంతరం భారతదేశ చరిత్రలో గాంధీ హత్యకు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి మీద ఉన్న గౌరవం, ఆరాధన భావం ఇంకేవిషయాలను పట్టించుకొనివ్వదు. అందుకే గాడ్ సే అనగానే మన కళ్ళముందు ఒక హంతకుడు ప్రత్యక్షం అయ్యేలా మైండ్ సెట్ అయిపోయింది. ఏ హత్య వెనకైనా అనేక అంశాలు ఉంటాయి. గాంధీ హత్య క్షిణికావేశంతో చేసినది కాదు. దానికి గాడ్ సే పశ్చాతాపపడలేదు. గాంధీ హత్య అనంతరం ఆయన కుమారుడు అప్పట్లో హిందూస్తాన్ టైమ్స్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న దేవదాస్ గాంధీ తిన్నగా పోలీస్ స్టేషన్ లో ఉన్న గాడ్ సే దగ్గరకు వెళ్లారు. హత్య వ్యక్తిగతమా? అని అడిగారు. కాదని స్థిరంగా సమాధానం చెప్పారు గాడ్ సే.  గాడ్ సే జస్ట్ ఒక క్రిమినల్ కాదు. గాడ్ సే ఒక పత్రికా సంపాదకులు. అగ్రణి, హిందు రాష్ట్ర అనే పత్రికలకు సంపదకుడిగా వ్యవహరించిన వ్యక్తి. చిన్నప్పటి నుండి స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. గాడ్ సే ను సమగ్రంగా అర్థం చేసుకోకపోతే భారతదేశ చరిత అర్థం కాదు. గాడ్సే ను అధ్యయనం చేయడం ప్రారంభించిన తరువాత .. ఇది మా కచ్చితమైన అభిప్రాయం.గాంధీ హత్య నేపథ్యంలో భారతదేశంలో ఒక నవలగానీ సినిమా గానీ రాకపోవడం దారుణం. ఈ తప్పుని సరిచేయలనే లక్ష్యంతో మరణ వాగ్మూలం సినిమా తెలుగు హిందీ భాషల్లో రూపొందించాలనుకున్నాము. ఇది ఒక యజ్ఞంగా ఈ దేశ ప్రజల ముందు వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రమే కాదు గాడ్సే విస్మరించాల్సిన అధ్యాయం కాదు అని చెప్పాలనే లక్ష్యంతో తీస్తున్న సినిమా.
చిత్ర దర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ…ఓపెన్ గా గాడ్ సే గురించి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. అంతా కొత్తవారితో ఈ సినిమా చెయ్యబోతున్నాను. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై రీసెర్చ్ చేశాను. మీదట ఈ సబ్జెక్ట్ మీద నవల రాద్దాం అనుకున్నాను. కానీ గాడ్ సే భావాజాలాన్ని చెప్పడానికి సినిమా తీస్తే బాగుంటుందని అనిపించింది. ఈ సినిమా ఇప్పుడు తియ్యడం కరెక్టని భావించి తీస్తున్నాను అన్నారు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ…గాడ్ సే రాసిన పుస్తకం అందరిని ఆలోచింపజేస్తుంది. గాడ్ సే కోర్ట్ లో తన వాగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది.  ఆసక్తికరమైన కథ కథలతో సాగబోతున్న ఈ సినిమా గురించి నేను ఎదురుచూస్తున్నానని తెలిపారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ…నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న భరద్వాజ్ గారు చేస్తున్న మరణ వాగ్మూలం ఒక సంఘటనను ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఒక ఆశక్తికరమైన అంశంగా ఉంటుందని తెలిపారు.
నిర్మాత సూరజ్ మాట్లాడుతూ…డైరెక్టర్ భరద్వాజ్ గారు గాడ్సే మీద సినిమా గురుంచి ఐడియా చెప్పగానే ఆసక్తికరంగా అనిపించింది. మరణ వాగ్మూలం పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తాం.. అన్నారు.