వైష్ణ‌వ్‌తేజ్‌‌‌ పారితోషికం ‘ఉప్పెన’‌లా పెరుగుతోంది!

వైష్ణ‌వ్‌తేజ్‌‌‌తొలి సినిమా ‘ఉప్పెన’‌ బాక్సాపీస్ వ‌ద్ద ఘన విజ‌యం సాధించ‌డంతోపాటు, వైష్ణ‌వ్ తేజ్‌ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు వైష్ణ‌వ్‌తేజ్ డేట్స్ కోసం చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎదురుచూస్తున్నారు‌. అయితే వైష్ణ‌వ్‌తేజ్ మొద‌టి మూడు సినిమాల‌కు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఉప్పెన’‌కు వైష్ణ‌వ్ రూ.50 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు స‌మాచారం. అతని  రెండో చిత్రానికి రూ.75 ల‌క్ష‌లు కాగా.. వైష్ణ‌వ్ తేజ్ మూడో చిత్రానికి వైష్ణ‌వ్ రూ.2.50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి ఓ కొత్త హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ, తీసుకుంటున్న పారితోషికం విషయంలో భారీ పెరుగుదల ఉండటం ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’ గా మారిపోయింది.

‘ఉప్పెన’ యూనిట్ కు నిర్మాత బహుమతులు !… మైత్రీ మూవీ మేక‌ర్స్ వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టిని ప‌రిచ‌యం చేస్తూ ‘ఉప్పెన’తో  బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టింది ‌.  ‌బుచ్చిబాబుకు డైరెక్ట‌ర్ గా తొలి సినిమాతోనే మంచి బ్రేక్ వచ్చింది. ఉప్పెన అంచ‌నాలు దాటి క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది. ఈ మూవీ స‌క్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న మేకర్స్ వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టి‌ల‌కు ఖ‌రీదైన కానుక‌ల‌ను ఇవ్వాల‌నుకుంటున్నార‌ట. ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం మేర‌కు వైష్ణ‌వ్‌తేజ్‌కు రూ.కోటి, కృతిశెట్టికి రూ.25 ల‌క్ష‌లు అద‌నంగా ఇవ్వాల‌నుకుంటున్నార‌ని టాక్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకు ఖ‌రీదైన ఇళ్లు లేదా కారును బ‌హుమ‌తిగా ఇవ్వాల‌నుకుంటున్నార‌ట. మ‌రోవైపు చిత్ర‌యూనిట్ స‌భ్యుల‌కు కూడా బ‌హుమ‌తి ఇవ్వాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

వైష్ణ‌వ్ తేజ్ మూడో చిత్రానికి నిర్మాత నాగార్జున ?… ఉప్పెనతో మంచి విజ‌యం సాధించిన వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం ప‌లు క‌థ‌ల‌ను వింటూ ఉన్నాడు. రెండో సినిమాని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. ఇక మూడో సినిమాని వైష్ణ‌వ్ తేజ్ ఎవ‌రితో చేస్తాడు? ఏ నిర్మాణ సంస్థ రూపొందిస్తుంద‌నే ఆసక్తి  అభిమానుల‌లో ఉండ‌గా..  దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది. వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడో చిత్రాన్ని ఓ కొత్త డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌ట‌. అత‌ను చెప్పిన స్టోరీ నె‌రేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌కు న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ‘మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్’ బ్యాన‌ర్‌లో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రానికి వైష్ణ‌వ్ తేజ్ మూడు కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాక్.