వీరంతా కలిసి చేస్తే ఏ రేంజ్‌లో వుంటుంది ?

అమితాబ్‌ బచ్చన్,  రజనీకాంత్‌, ప్రభాస్‌, షారూఖ్‌ ఖాన్‌ కలిసి నటిస్తే ఆ సినిమా రేంజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.  భారతదేశంలోనే ఇదొక క్రేజీయెస్ట్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి సినిమా త్వరలోనే బాలీవుడ్‌లో పట్టాలెక్కబోతోంది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా, కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ‘శిద్వాత్‌’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, ప్రభాస్‌ అతిథి పాత్రల్లో మెరవనున్నారట. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో షారూఖ్‌ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో అతిథులుగా నటించే స్టార్‌ హీరోలతో చిత్రయూనిట్‌ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఇదొక బిగ్గెస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్‌గా సంచలనం సృష్టించడం ఖాయం. అలాగే మార్కెట్‌ పరంగానూ నేషనల్‌, ఇంటర్నేషనల్‌ లెవెల్‌లో బాగా కలిసి వస్తుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో పట్టాలెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారట. షారూఖ్‌ ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌.రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.