‘బిగ్‌బాస్‌’ ఆమె కెరీరే మార్చేసాడు !

తెలుగమ్మాయి నటి బిందు మాధవి తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఆ తరువాత కోలీవుడ్ కి మారింది.ఆమె అక్కడ చేసిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి.  ఇటీవల కమల్ హసన్  నిర్వహించిన తమిళ్ ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్న అనంతరం బిందుమాధవి చాలా ఆనందంగా ఉంది. ఈ షో ద్వారా చాలా మంది పాపులారిటీ తెచ్చుకున్నారు. నటి ఓవియ, రైసా లాంటి హీరోయిన్లకు బిగ్‌బాస్‌కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునేలా కెరీర్‌ మారింది. బిగ్‌బాస్‌ గేమ్‌లోకి కాస్త ఆలస్యంగా వచ్చిన నటి బిందుమాధవి కెరీర్‌ ఇప్పుడు జోరందుకుంది. వరుసగా ఆమెకు మంచి చిత్రాలు వస్తున్నాయి.

పళనియప్పన్‌ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది బిందుమాధవి.పార్తీపన్‌ ‘కణవు’ లాంటి వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు పళనియప్పన్‌ చాలా గ్యాప్‌ తరువాత మోగాఫోన్‌ పడుతున్నారు. ఆయన ‘పెగళేంది ఎనుమ్‌ నాన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో అరుళ్‌నిధి హీరోగానూ, బిందుమాధవి హీరోయిన్‌గానూ నటించనున్నారు.

ఈ సందర్భంగా బిందుమాధవి స్పందిస్తూ…. అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నానని తెలిపింది. నటనకు అవకాశం ఉన్న కథ, పాత్రల్నే కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ‘పుగళేంది ఎనుమ్‌ నాన్‌’ రాజకీయ నేపధ్యంలో సాగే కథ అని, అయినా తన పాత్రలో నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. అదే విధంగా అరుళ్‌నిధికి జంటగా నటించడం ఆనందంగా ఉందని అంది. త్వరలో మరికొన్ని చిత్రాల వివరాలు వెల్లడిస్తానంది