తెరపైకి జగపతి జీవిత ‘సముద్రం’

జగపతిబాబు …ఇప్పుడు తెలుగు, తమిళ్లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్.క్యారెక్టర్స్‌కు, నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచి, సెకండ్ ఇన్నింగ్స్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు . స్టార్ ప్రొడ్యూసర్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో మంచి విజయాలు అందుకున్న జగపతి,ఇప్పుడు హీరోగా కంటే విలన్‌గా ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మధ్యలో పరాజయాలు పలకరించడం, మార్కెట్ డౌన్ అయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో… హీరో వేషాలు పక్కన పెట్టి విలన్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ఆ ప్రయాణాన్నే ఇప్పుడు ‘సముద్రం’గా తెరపై చూపించబోతున్నాడు జగపతిబాబు. జగపతిబాబుపై బయోపిక్‌కు రంగం సిద్ధం అయ్యింది. హీరో కమ్ స్టైలిష్ విలన్‌గా సౌత్‌లో దూసుకెళ్తోన్న జగపతి బాబు లైఫ్ హిస్టరీని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. 
జగపతి బాబు కెరీర్‌లో బోలెడన్ని ఎత్తుపల్లాలున్నాయి.అతని కెరీర్ స్టార్టింగ్‌లోనే ఊహించిన విజయాలు దక్కలేదు. మొదట్లో గొంతు బాగోలేదని డబ్బింగ్ చెప్పించారు. తర్వాత హీరోగా నిలదొక్కుకుంటోన్న సమయంలో…అప్పటి హీరోలకు భిన్నంగా ‘అంతఃపురం’ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించాడు. వైవిధ్యమైన ప్రయాణం చేశాడు, చేస్తున్నాడు. ఇలా జగపతి లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అందుకే జగపతి బయోపిక్‌కు ‘సముద్రం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం గోవా తదితర ప్రాంతాల్లో ఈ బయోపిక్ షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘సముద్రం’ టైటిల్‌తో రూపొందిన చిత్రంలో జగపతిబాబు హీరోగా నటించడం తెలిసిందే! అయితే ఇప్పుడీ ‘సముద్రం’ వెండితెర పైకి రావడం లేదు. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్‌లో 20కి పైగా ఎపిసోడ్స్‌తో టెలికాస్ట్ అవ్వబోతోంది.