సంజ‌నా రెడ్డి దర్శకత్వంలో క‌ర‌ణం మల్లేశ్వరి బయోపిక్!

2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.
 
ఈ నేప‌థ్యంలో 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చిన క‌ర‌ణం మల్లేశ్వరి బ‌యోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యాన‌ర్స్‌పై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన‌వెంక‌ట్ నిర్మిస్తున్న ఈ బ‌యోపిక్‌ను సంజ‌నా రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించనున్నారు.
Sanjana Reddy directs Karnam Malleswari biopic
here is an exciting biopic that is in the making. It will tell the story of Karnam Malleswari, the legendary weightlifter, who is the first Indian woman to win a medal at the Olympics. Biopics have become a trend in Indian cinema. Filmmakers are telling the stories of accomplished men and women from the fields of politics, cinema, sports and other walks of life. Besides those that we have already seen, quite a few other biopic projects are in talks.
In this scenario, here is an exciting biopic that is in the making. It will tell the story of Karnam Malleswari, the legendary weightlifter, who is the first Indian woman to win a medal at the Olympics.The story of the inspiring role model of many Indian women will be told as a pan-India movie. MVV Satyanarayana and Kona Venkat are producing this promising project on MVV Cinema and Kona Film Corporation. Sanjana Reddy will wield the megaphone. Written by Kona Venkat, the film’s cast and crew details will be announced soon.