అందాల నటి మాధురి నిర్మాతగా మారుతోంది !

బాలీవుడ్‌ అందాల నటి మాధురి దీక్షిత్‌  ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ‘ఆర్‌.ఎన్‌.ఎం మూవింగ్‌ పిక్చర్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పతాకంపై ఆమె త్వరలో ఓ మరాఠీ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. స్వప్ననీల్‌ జయకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

సొంత చిత్రం గురించి మాధురి మాట్లాడుతూ  ‘‘మా ఆర్‌ ఎన్‌ ఎం మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌తో సినిమా రంగంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. యోగేశ్‌ వినాయక్‌ జోషి ఈ చిత్ర కథను చాలా చక్కగా తీర్చిదిద్దారు. సకుటుంబంగా చూసే విధంగా తెరకెక్కిస్తాం. చాలా చక్కటి టీమ్‌ ఈ సినిమా కోసం పనిచేస్తోంది. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్తాం’’ అని అన్నారు. బాలీవుడ్‌ నటీమణులు అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇప్పటికే నిర్మాణరంగంలో అడుగుపెట్టిన సంగతి విదితమే.

బాలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ హీరోయిన్‌గా మాధురీ దీక్షిత్‌ ఎన్నో విజయవంతమైన వినోదాత్మక  చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె సినీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమెరికాలో ఓ టెలివిజన్‌ సిరీస్‌ను రూపొందించేందుకు మాధురీ భర్త శ్రీరామ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఆయన ప్రముఖ రచయిత అనే విషయం అందరికీ విదితమే. ప్రస్తుతం మాధురీపై తెరకెక్కించే సిరీస్‌ కోసం ఆయన స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌ను సహనిర్మాతగా ప్రియాంక చోప్రా నిర్మించడం విశేషం