అవగాహన లేకుండా చేస్తే అది పిచ్చి పని అవుతుంది !

చెల్లిలి ని హీరోయిన్ ని చెయ్యడం కోసం కోసం కత్రినా నిర్మాతగా మారబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న వేళ… సినీ నిర్మాణం జోలికి వెళ్లనని కత్రినా చెప్పడం గమనార్హం.

“సినిమా నిర్మాణం పిచ్చి పని కాదు. కనీస అవగాహన లేకుండా  నేను సినిమా నిర్మాణం చేస్తే అది నిజంగానే పిచ్చి పని అవుతుంది” అని పేర్కొంది బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినాకైఫ్. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగుతున్న ఈ అమ్మడు రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన ‘జగ్గా జాసూస్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా నిర్మాణపరంగా చాలా సమయం తీసుకుంది. దీనికి కారణం సినిమాలోని కంటెంటేనట. ఫిల్మ్‌మేకర్స్ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా నిర్మాణ సమయంలోనే తనకు నిర్మాత కష్టాలేంటో తెలిసొచ్చాయని చెప్పింది కత్రినాకైఫ్. “హీరోయిన్‌గా నా పని నేను చేసుకు వెళ్లడమే కాదు… సినిమా నిర్మాణం గురించి కూడా చాలా తెలుసుకున్నాను. అప్పుడే సినిమా నిర్మాణం ఎంత కష్టమైన పనో నాకు తెలిసింది. అందుకే సినిమా నిర్మాణం గురించి ఇప్పట్లో ఆలోచించకూడదనే నిర్ణయానికి వచ్చాను”అని చెప్పింది కత్రినా.