దానిపై ఖచ్చితంగా ఓ పుస్తకం రాస్తా !

‘మాతృత్వంపై కచ్చితంగా ఓ పుస్తకం రాస్తాను. గర్భవతిగా ఉన్నప్పట్నుంచి ఎన్నో మధురమైన అనుభూతులను పొందాను ‘ అని అంటోంది  ప్రముఖ బాలీవుడ్ నటి ,మోడల్ కరీనా కపూర్‌. ఆమె చివరిగా గతేడాది ‘ఉడ్తాపంజాబ్‌’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రెగెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తనయుడు తైమూర్‌ అలీ ఖాన్‌కు జన్మనిచ్చి ప్రస్తుతం ఆ మాతృత్వ అనుభూతుల్ని ఆస్వాదిస్తున్నారు.
ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ భార్య అయిన కరీనా చెబుతూ… ‘గర్భం దాల్చినప్పట్నుంచి నేను పొందే అనుభూతిని వీడియో షూట్స్‌, ఇమేజెస్‌, డాక్యుమెంట్స్‌ రూపంలో భద్రపరిచాను. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి మూమెంట్‌ను చాలా ఎంజాయ్ చేశాను. మాతృత్వం చాలా గొప్పగా ఉంది. వీటన్నింటిని మేళవిస్తూ ఓ పుస్తకం రాయాలనుకుంటున్నా’ అని తెలిపింది. కరీనా ఇటీవలే   ‘వీరె ది వెడ్డింగ్‌’   చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.