బ్రయాన్ ఆడమ్స్‌ను స్వాగతిస్తున్న ప్రభాస్

ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ బ్రయాన్ ఆడమ్స్‌కు  కోట్లమంది అభిమానులున్నారు. ఇండియాలో కూడా అతనికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ స్టార్ సింగర్ అక్టోబర్‌లో మన దేశానికి వస్తున్నాడు. బ్రయాన్ టూర్ కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రయాన్ కాన్సర్ట్ కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ అంతటివాడే ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. బ్రయాన్‌తో రెహమాన్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ స్టార్ సింగర్ ఇండియా టూర్‌కు వెల్‌కం చెబుతూ ఆనందాన్ని వ్యక్తంచేసింది.

ఇక టాలీవుడ్ నుంచి బ్రయాన్‌కు ఘన స్వాగతం పలకబోతున్నాడు స్టార్ హీరో ప్రభాస్. బ్రయాన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత అతనికి ఘనమైన విందు ఇచ్చేందుకు అతను ఏర్పాట్లు చేస్తున్నాడు. ఒక అంతర్జాతీయ గాయకుడికి ప్రభాస్ పార్టీ ప్లాన్ చేశాడంటే దాని వెనుక ప్లాన్ కూడా అంతే ఘనమైనదని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’కు హాలీవుడ్‌లో కావాల్సిన ప్రమోషన్ బ్రయాన్ వల్ల వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ మూవీ ‘మ్యాట్రిక్స్’ తరహా యాక్షన్ సినిమా ‘సాహో’ కాబట్టి పాశ్చాత్య దేశాల్లో దీన్ని విడుదల చేసి క్యాష్ చేసుకోవడం కోసం ప్రభాస్ తెలివిగా ఇలా ప్లాన్ చేశాడు.