రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫ‌ర్స్!

ఓ నూత‌న ద‌ర్శ‌కుడు, నూత‌న నిర్మాణ సంస్థ‌లో రూపొందిన‌ `ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో` చిత్రం విడుద‌ల‌కు ముందే క్రేజీ బిజినెస్ ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటోంది.  ఇప్ప‌టికే  ఈ చిత్రానికి సంబంధించిన త‌మిళ రీమేక్ రైట్స్  ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే…ఓ పెద్ద ప్రొడ్యూస‌ర్ మ‌రియు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఇటీవ‌ల సినిమా చూసి, విప‌రీతంగా సినిమా న‌చ్చ‌డంతో తామే మూవీ ని రిలీజ్ చేస్తామ‌నీ, త‌మిళ రీమేక్ రైట్స్ కూడా త‌మ‌కే ఇవ్వాల‌న్న కండీష‌న్ పెట్టిన‌ట్లు స‌మాచారం.
ఈ డీల్ ఓకే అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ట్లే అని చెప్పాలి. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ అత్య‌ధిక వ్యూస్ తో దూసుకెళ్తూ…ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. `ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో` చిత్రం నందు  కెరీర్ లో నే  ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని సినిమా చూసిన ప్ర‌ముఖ‌ ప్రొడ్యూస‌ర్, డిస్ట్రిబ్యూట‌ర్స్ చెప్ప‌డం విశేషం.
హరి హర చలన చిత్ర పతాకం‌పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో యంగ్ హీరో నందు, సౌమ్య జంటగా నటిస్తున్న మూవీ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘స్వామిరారా’ ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్రలో నిర్మిస్తున్న ఈ సినిమాను ఒక థ్రిల్లింగ్ ఫాయింట్‌తో ఆసక్తికరంగా తెరకెక్కుస్తున్నట్టు యూనిట్ తెలిపింది.  ప్రేక్షకులు కోరుకునే అన్ని హంగులతో తెరకెక్కిస్తున్నఈ మూవీని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. మురళీమోహన్‌ రెడ్డి, సంగీతం: యాజమాన్య