ఇక స్పెషల్‌ సాంగ్స్‌కి గుడ్ బై !

ఇకపై ప్రత్యేక పాటల్లో నర్తించేందుకు అంగీకరించనని ‘సరైనోడు’ చిత్రంతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్‌ చెబుతోంది. ‘ఛమ్మక్‌ ఛల్లో’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘పైసా’, ‘ఎర్రబస్‌’ వంటి తదితర తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘పైసా’ తప్ప కేథరిన్‌కి ఏ సినిమా తెలుగులో మంచి గుర్తింపునివ్వలేదు. అంతేకాదు మరిన్ని అవకాశాలూ రాలేదు. దీంతో మలయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో నటించిన ‘సరైనోడు’ చిత్రం సాధించిన విజయంతో కేథరిన్‌ తెలుగునాట బాగా బిజీ అయిపోయింది.

ప్రస్తుతం రానాకి జోడీగా ‘నేనే రాజు నేనే మంత్రి’, గోపీచంద్‌ సరసన ‘గౌతమ్‌ నంద’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు ‘కదంబన్‌’, ‘కథానాయగన్‌’ వంటి తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ పలు ఆఫర్లతో దూసుకెళ్తున్న కేథరిన్‌కి ప్రత్యేక పాటల్లో నటించే అవకాశాలూ మెండుగా వస్తున్నాయి. వీటి గురించి కేథరిన్‌ స్పందిస్తూ…. ‘ఇకపై స్పెషల్‌ సాంగ్స్‌లో నటించదల్చుకోలేదు. హీరోయిన్‌గా లభిస్తున్న మంచి మంచి ఆఫర్లను సద్వినియోగం చేసుకునే విషయంపైనే ఎక్కువ ఫోకస్‌ చేశాను’ అని చెప్పింది.