`సిబిఐ వ‌ర్సెస్ ల‌వ‌ర్స్` ఆడియో లాంచ్‌ !

ఇరుకళల‌ పరమేశ్వరి ప్రొడక్షన్స్  ప‌తాకంపై  నెట్రంబాక హ‌రిప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.హ‌రిత ప్రియా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం  `సిబిఐ వర్సెస్ ల‌వర్స్‌`. వంశీ , జైన్ నాని, దివ్య‌, శ్రావ‌ణి నిక్కి జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సుమ‌న్‌, స‌త్య ప్ర‌కాష్ లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఘ‌న శ్యామ్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రం ఆడియో ఈ రోజు హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. తొలి సీడీని న‌టుడు సుమ‌న్ ఆవిష్క‌రించి మ‌రో న‌టుడు స‌త్య ప్ర‌కాష్  కు అందించారు.
అనంత‌రం సుమ‌న్ మాట్లాడుతూ…“సిబిఐ కు ల‌వ‌ర్స్ కు ముడిపెడుతూ ఒక ఇంట్ర‌స్టెంగ్ టైటిల్ లో సినిమా చేశాడు దర్శ‌కుడు. పాట‌లు, ట్రైల‌ర్ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాలు, కొత్తద‌నంతో కూడిన చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. ఆ కోవ‌లో ఈ సినిమా కూడా ఉంటుంది. ఇక ప్ర‌భుత్వాలు  థియేట‌ర్స్ విష‌యంలో క‌ల‌గ‌జేసుకుని చిన్న చిత్రాల‌కు అండ‌గా నిలిస్తే ఇంకా ఎన్నో చిన్న చిత్రాలు వ‌చ్చి ఎంతో మందికి ప‌ని దొరుకుతుంది. అంతా కొత్త‌వారైనా ఎంతో హార్క్డ్  చేసి ఈ సినిమా చేశారు. నేను, స‌త్య ప్ర‌కాష్ ఇందులో మంచి పాత్ర‌లు చేసాము“ అన్నారు.
న‌టుడు స‌త్య ప్ర‌కాష్ మాట్లాడుతూ… `శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన ఈ ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌డం శుభ సూచ‌కం. పాట‌లు, ట్రైల‌ర్స్ బావున్నాయి. సినిమా క‌చ్చితంగా మంచి విజ‌యం సాధిస్తుంద‌న్నారు.
నిర్మాత ఎన్‌.హ‌రిత ప్రియా రెడ్డి మాట్లాడుతూ…“తొంద‌ర పాటు నిర్ణ‌యాల వ‌ల్ల స్టూడెంట్స్ ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌నే కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసాం. ద‌ర్శ‌కుడు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తీసారు. స్టూడెంట్స్, పేరెంట్స్ అంద‌రూ చూడాల్సిన చిత్ర‌మిది. టీమ్ అంద‌రూ ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న విధంగా సినిమా చేయగ‌లిగాము. దీని త‌ర్వాత `బ్ర‌హ్మ‌ముహూర్తం` అనే మ‌రో సినిమా నిర్మించ‌నున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు నెట్రంబాక హ‌రి ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ…“ త‌ప్పు చేసిన వారికి శిక్ష త‌ప్ప‌దు అనే సందేశం మా చిత్రం ద్వారా ఇస్తున్నాం. అలాగే అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చే ఎంట‌ర్టైన్మెంట్ మా చిత్రంలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.  త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో కాదంబ‌ర్ కిర‌ణ్ తో పాటు వంశీ, జైన్ నాని, దివ్య , శ్రావణి నిక్కి త‌దిత‌రులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి  సంగీతం: ఘన శ్యామ్‌, సినిమాటోగ్ర‌ఫీ: వెంకయ్య;  ఎడిటర్‌: వెంకటేశ్వర రావు;  నిర్మాత: ఎన్‌.హరిత ప్రియా రెడ్డి, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః నెట్రంబాక హ‌రి ప్ర‌సాద్ రెడ్డి.