మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అక్కినేని కథానాయకులకు కొత్తేమి కాదు. తాజాగా ఈ ఫ్యామిలీ హీరోల నుంచి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్ కథానాయకులుగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నాగార్జునతో ‘మన్మథుడు-2’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ పనితనం ఎంతగానో మెచ్చిన నాగార్జున ఈ మల్టీస్టారర్ బాధ్యతలు ఆయనకే అప్పజెప్పారని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇదిలావుండగా ‘మన్మథుడు-2’ అనంతరం నాగార్జున కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత నాగచైతన్య, అఖిల్ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.నాగ చైతన్య ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు.‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. జీఎ2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
త్వరలో అక్కినేని సోదరులు కలిసి చేస్తున్నారు !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. ‘ఫిదా’ వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం తో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది.డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.