‘మూడు వందల ముప్పై నాలుగో కథ’

‘333 కథలు ఉన్న ఓ పాత పుస్తకం చుట్టూ తిరిగే కథ. 334వ కథ ఏమిటన్నది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంద’ని అంటున్నారు దర్శక, నిర్మాతలు. కైలాష్‌, అభిషేక్‌, చంద్రశేఖర్‌, కరన్‌, ప్రియా, మధు, వర్షా, రాధికా, సందీప్‌, వినరు ప్రధాన తారాగణంగా క్రియేటివ్‌ మైండ్‌ ప్రొడక్షన్‌, శ్రావణి మీడియా కమ్యూనికేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా వెంకటనారాయణ దర్శకత్వంలో చంద్రనాథ్‌ చంగల నిర్మిస్తున్న ‘మూడు వందల ముప్పై నాలుగో కథ’.
ఈ చిత్రానికి సంబంధించి లోగో లాంచ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ…. ‘సాధారణంగా రెండు గంటల వ్యవధిలో ఒక కథ చెప్పి, ప్రేక్షకులను కన్వీన్‌స చేయటమే చాలా కష్టం. అలాంటిది మా సినిమా ఫస్టాఫ్‌లో హర్రర్‌, సస్పెన్స్‌, రొమాన్స్‌, యాక్షన్‌ ప్లస్‌ థ్రిల్‌ వంటి జోనర్స్‌ను మిక్స్‌ చేస్తూ 6 కథలతో రూపొందిస్తున్న చిత్రమే అయినప్పటికీ ఒకే ఒక క్లయిమాక్స్‌ ఉంటుంది. అలాగే 100కి పైగా ఉండే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.