‘చిన్నారి పెళ్ళికూతురు’ చిక్కి పోయింది !

అవికా గోర్ “చిన్నారి పెళ్లికూతురు”లో ఆనందిగా తెలుగు, హిందీ తదితర భాషల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది . ఆ ఆదరణతోనే తెలుగులో ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది.  తాజాగా నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లో చేసింది. ఆ సినిమా తర్వాత ఆమె కనిపించలేదు.

దాదాపు ఆరేడునెలల సమయాన్ని ఆమె డైరెక్షన్ కోర్సులో శిక్షణ తీసుకునేందుకు వినియోగించుకుందని టాక్. అయితే.. తాజాగా ఆమె ఈ ఫొటోతో అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.  తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోను చూసిన వాళ్లంతా.. ‘మనం చూసిన చిన్నారి పెళ్లికూతురేనా..?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కొద్ది కాలంలో చాలా బరువు తగ్గిందట అవిక. ఇదిగో అలా బరువు తగ్గి.. అంత సన్నగా, బక్కగా ఉన్న ఫొటోను ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఎందుకో ఆమెలో ఇంత మార్పు! మరి, ఈ ఫొటోను చూసి మీరు కూడా నిజంగా మన చిన్నారి పెళ్లికూతురేనా? అని ఆశ్చర్య పోతున్నారు కదూ…