మెగాస్టార్ ప్ర‌శంసించిన నిఖిల్ `అర్జున్ సుర‌వరం` టీజ‌ర్‌

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. మార్చి 29న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇన్‌టెన్స్‌తో ఉన్న ఈ టీజ‌ర్ 24 గంట‌ల్లో 2.3 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసి ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా ప్ర‌శంస‌లు రావ‌డం యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
టీజ‌ర్ చాలా బావుంద‌ని ఎంటైర్ యూనిట్‌కు చిరంజీవి శుభాకాంక్ష‌లు అందించారు. యూనిట్‌ను, త‌మ చిత్రాన్ని అభింనందించిన మెగాస్టార్ చిరంజీవికి హీరో నిఖిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
“నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్న `అర్జున్ సుర‌వ‌రం` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి 29న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు నిర్మాత‌లు.
 
న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..
సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్, మూవీ డైన‌మిక్స్
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య ,సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ ,ఫైట్స్: వెంక‌ట్