చిరంజీవి ప‌వ‌ర్‌ఫుల్‌ `ఆచార్య‌` గా టాకీ పార్ట్ పూర్తి !

`ఆచార్య‌`పాత్రలో చిరంజీవి.. రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `ఆచార్య‌`…కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణ.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం . టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల బ్యాలెన్స్ ఉంది. చిరంజీవి.. చ‌ర‌ణ్ మీద  ఆగ‌స్ట్ 20 నుండి  ఓ పాట, చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే మీద మ‌రో సాంగ్‌ను చిత్రీక‌రణ తో  మొత్తం షూటింగ్ పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.
`ఆచార్య‌`లో మెగాస్టార్  పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. రామ్‌చరణ్‌ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను.. ప్రేక్ష‌కాభిమానులు మెచ్చేలా క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో.. తెర‌కెక్కించ‌గల డైరెక్ట‌ర్ కొర‌టాల శివ త‌న‌దైన శైలిలో `ఆచార్య‌` రూపొందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇప్ప‌టికే విడుద‌లైన `లాహే లాహే..`పాటకు , టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది”.. అని నిర్మాణ సంస్థ వారు తెలియ‌జేశారు.
కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు ఇందులో ప్రధాన పాత్రధారులు.
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సురేశ్ సెల్వ‌రాజ్‌
ఎడిట‌ర్: న‌వీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ కుమార్