ఉయ్యాలవాడ సినిమా పేరు ‘మహావీర’

 ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్‌ను మార్చాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి బదులు ‘మహావీర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.
 కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు భాషల్లోని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండడం కోసం టైటిల్‌ను మార్చాలని నిర్ణయించారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. చిరు జన్మదినం కంటే ముందే స్వాతంత్ర దినోత్సవం రోజే షూటింగ్ ప్రారంభిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అవే నిజమైతే ఇంకో నెల రోజుల్లో చిరు 151వ సినిమా టైటిల్ ఏమిటనే విషయం తెలిస్తుంది.