తెలుగు సినిమా రేంజ్‌ మరింత పెంచే `సైరా నరసింహారెడ్డి`

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.
కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాలకు అనుగుణంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి నిలిచిన తొలి స్వాతంత్ర్య యోధుడు .. చరిత్ర మరుగున పడిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెరుగుతున్న తెలుగు సినిమా స్పాన్‌కు అనుగుణంగా పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా మేకింగ్ వీడియోను నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ విడుదల చేసింది. వీడియో చూసిన వారందరూ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అనేంతలా గొప్పగా మేకింగ్ ఉంది. రామ్ లక్ష్మణ్, గ్రెగ్ పావెల్, లీ విట్టాకర్ నేత‌ృత్వంలో యాక్షన్ పార్ట్‌ను ఎంత గొప్పగా చిత్రీకరించారో మేకింగ్ వీడియో ఎలివేట్ చేస్తుంది. అలాగే గూస్ బమ్స్ వచ్చేలా ఈ ఇప్పటి వరకు తెలుగు తెరపై రానివిధంగా అద్భుతమైన యాక్షన్ పార్ట్‌తో సినిమా రూపొందుతోందని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు. అలాగే సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, జగపతిబాబు, రవికిషన్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా ఈ యాక్షన్ టీజర్‌లో విడుదల చేశారు. అలాగే చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22) సందర్భంగా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. మేకింగ్ వీడియో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. భారీ అంచనాల నడుమ నిర్మితమవుతోన్న `సైరా నరసింహారెడ్డి` సినిమా గురించి మెగాభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అందరి అంచనాలను మించేలా ఉంటుందని మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది.
 
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక తదితరులు
సాంకేతిక నిపుణులు:దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామ్‌చరణ్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్: కమల్ కణ్ణన్, రచన: పరుచూరి బ్రదర్స్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, స్టంట్స్: గ్రెగ్ పావెల్, లీ విట్టాకర్, రామ్ లక్ష్మణ్.