ఈ సారి కూడా జేమ్స్ బాండ్ నేనే !

 జేమ్స్‌బాండ్ గా కొత్త చిత్రం లో ఎవ‌రు చేస్తార‌న్న‌ది తేలిపోయింది. జేమ్స్‌బాండ్‌గా మ‌ళ్లీ తానే వ‌స్తున్న‌ట్లు డానియ‌ల్ క్రేగ్ చెప్పేశాడు.హాలీవుడ్‌ నుంచి ఎన్ని చిత్రాలొచ్చినా జేమ్స్‌బాండ్‌ చిత్రాలకున్న ఆదరణ వేరు. జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. ఎంతోమంది బాండ్‌లుగా అలరించారు. ‘క్యాసినో రాయల్‌’, ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సొలేస్‌’, ‘స్కైఫాల్‌’, ‘స్పెక్టర్‌’… ఈ నాలుగు బాండ్‌ చిత్రాల్లోనూ తనదైన స్టైల్‌తో నటించి మెప్పించాడు డేనియల్‌ క్రెగ్‌. ఈ చిత్రం తర్వాత ‘ఇకపై బాండ్‌ చిత్రాల్లో నటించన’ని ఒక సందర్భంలో చెప్పి అభిమానుల్ని నిరాశపరిచాడు. జేమ్స్‌బాండ్‌ 25వ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి మెట్రో గోల్డ్‌ వైన్‌ మేయర్‌, ఎవోన్‌ ప్రొడక్షన్స్ సంస్థలు . కానీ బాండ్‌ ఎవరనేది ప్రకటించలేదు.

తాజాగా ఈ చిత్రంలో బాండ్‌గా నటించేది తనే అని డేనియల్‌ క్రేగ్‌ ప్రకటించాడు. ఇటీవల ‘ది లేట్‌ షో విత్‌ స్టీఫెన్‌ కోల్‌బెర్ట్‌’ టీవీ షోలో పాల్గొన్నాడు డేనియల్‌ క్రేగ్‌. ఇందులో షో హోస్ట్‌ కోల్‌బెర్ట్‌ ‘‘మీరు మళ్లీ ఏజెంట్‌ 007 కనిపిస్తారా?’’అని అడిగితే ‘అవును’ అని సమాధానం చెప్పాడు క్రెగ్‌. కొన్ని నెలల్లోనే బాండ్‌గా మళ్లీ కనిపించనున్నట్లు చెప్పాడు క్రెగ్‌.25వ బాండ్ మూవీ 2019 న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ది. అయితే దీనికి సంబంధించి ఇటీవ‌ల చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు డానియ‌ల్ తెలిపాడు. బాండ్ రోల్ చేయాల‌ని ఉన్న‌ది, నాకో బ్రేక్ కావాల‌ని క్రేగ్ టీవీ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అయితే స్పైగా అదే చివ‌రి మూవీ అవుతుంద‌ని అత‌ను వెల్ల‌డించాడు. ‘‘ప్రస్తుతం ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మిగలిన విషయాలు వెల్లడవుతాయ’’ని ఆయన అన్నాడు. ‘ఇకపై బాండ్‌గా నటించను’ అని గతంలో చెప్పిన దానికి స్పందిస్తూ ‘‘అదొక పిచ్చి సమాధానం’’ అని చెప్పాడు డేనియల్‌.పియ‌ర్స్ బ్రాస్న‌న్ త‌ర్వాత నుండీ క్రేగ్ బాండ్ పాత్ర పోషిస్తున్నాడు.