ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత ?

“వివాహానికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత జీవితంలో మధురానుభూతి పొందగలమా?” అని బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోనె ప్రశ్నిస్తోంది. దీపికా పదుకోనె రణ్‌వీర్‌ సింగ్‌తో వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తోంది . బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను దీపిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘రామ్‌లీలా’ సినిమా సెట్‌లో వీరు ప్రేమలో పడ్డారు. గతేడాది వీరి వివాహం జరిగింది.దీపికా పదుకోనె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు సహజీవనంపై స్పందించారు. “వివాహానికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత జీవితంలో మధురానుభూతి పొందగలమా. పెళ్లికి ముందే కాదు.. ఆ తర్వాత కూడా మా జీవితాలకు సంబంధించి కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొన్నాం. వివాహం అంటే నచ్చని వారు చాలా మంది ఉండొచ్చు . కానీ మేం అలా కాదు. వివాహ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు భార్యభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం” అంటూ దీపికా చెప్పుకొచ్చింది.
పెళ్లి తర్వాత కెరీర్‌ను కొనసాగిస్తూనే మా తల్లిదండ్రులు గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కెరీర్‌కు పెళ్లి అడ్డంకి కాదనే విషయాన్ని నమ్ముతాను. కెరీర్ హోదాను, గౌరవాన్ని కల్పిస్తుందని భావిస్తాను. అది నా తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నాను.. అని దీపిక పదుకోనె చెప్పారు .
సినిమాయే మాకు శక్తి
‘ముంబాయి అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజెస్‌'(మామి) అవార్డుల వేడుకలో .. మామి చైర్‌పర్పన్‌ దీపికా పదుకొనే, దర్శకుడు కరణ్‌ జోహార్‌, కిరణ్‌రావు మొదటి రోజు హాజరై సందడి చేశారు. ఈ సందర్బంగా దీపికా మాట్లాడుతూ…”చాలా మంది పెద్దలు, మేధావులు ఉండగా నేను ఈ ‘మామి’కి చైర్‌పర్సన్‌ ఉండడం అనేది.. మీలో చాలా మందికి బహుశా ‘అద్భుతమే’ అన్నట్టుగానే ఉంటుంది. చాలా మంది నేను చాలా యువకురాలిని, మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోయిన్‌ని, చాలా పొడవు ఉన్న నటిని ..ఇప్పుడు నేను ధరించిన దుస్తుల్లా ఉన్నానని అనుకుంటారు. కానీ నేను ఇక్కడ ఉండడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. నేను ఏ కమ్యూనిటీ (మామి)ద్వారా నేర్చుకున్నానో దానికి తిరిగి ఇచ్చేయాలి. అది నాకు చాలా ఇచ్చింది. మేం ‘ఒంటిరి అయిపోతున్నాం’ అన్న సమయంలో.. సినిమా మమ్మల్ని శక్తివంతులుగా తయారు చేసింది. ఆ సమయంలో డిజిటల్‌ స్ట్రీమింగ్‌, సామాజిక మాధ్యమాలు  అంతగా లేవు. మామి మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే.. కచ్చితంగా చిత్రసీమకు దూరమయ్యేవారం. మా హద్దులు దాటకుండా, అవరోధాలను, భయాలను పోగొట్టేలా చేసింది మామి. ‘సినిమాయే మాకు శక్తి’ అని నటిగా నేను బలంగా నమ్ముతా. ఇంతముందెప్పుడూ లేనంతగా ‘మామి’ అవసరం ‘..అని పేర్కొంది దీపికా పదుకొనే.
 
ప్రస్తుతం దీపికా ‘ఛపాక్’ చిత్రంతో పాటు రణ్‌వీర్‌తో కలిసి ‘83’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లెజండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.