భూమి మనకు అందించిన బెస్ట్‌ గిఫ్ట్‌ దీపిక !

ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేయగల ప్రముఖుల జాబితాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె నిలిచి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. హాలీవుడ్‌ స్టార్స్‌ నికోల్‌ కిడ్మన్‌, గాల్‌ గాడాట్‌, గ్రెటా గెర్విగ్‌, లెనా వెయితె వంటి వారి సరసన దీపికా చేరటం విశేషం. అమెరికాకు చెందిన ‘టైమ్స్‌ వీక్లీ’ న్యూస్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన వంద మంది అత్యంత ప్రభావం చూపించగల వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దీపికా ఉండటం విశేషం.

గతేడాది హాలీవుడ్‌ అగ్ర నటుడు విన్‌ డీజిల్‌తో కలిసి ‘త్రిబులెక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ గ్జెండర్‌ కేజ్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రంలో దీపికా నటించింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే సంజరులీలా భన్సాలీ ‘పద్మావత్‌’ చిత్రంలోని ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు ఈ చిత్రం రూ.300 కోట్లకుపైనే వసూలు చేసింది. అలాగే మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర కథానాయికగానూ నిలిచింది. దీంతోపాటు ప్రస్తుతం 18 బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ‘ది లైవ్‌ లవ్‌ లాఫ్‌’ ఫౌండేషన్‌తో కలిసి మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిలో అవగాహన కల్పిస్తూ మోటివేట్‌ చేస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని టైమ్స్‌ వీక్లి బృందం ఈ జాబితాను తయారు చేసింది.

స్టార్‌ మాత్రమే కాదు. యాక్టర్స్‌ యాక్టర్‌ !

‘టైమ్స్‌ వీక్లీ’ న్యూస్‌ మ్యాగజైన్‌ లో దీపికా ఫ్రొఫైల్‌ను తన హాలీవుడ్‌ ఫస్ట్‌ హీరో, ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ కో–స్టార్‌ విన్‌ డీజిల్‌ రాయడం విశేషం. ‘‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సినిమా టైమ్‌లో దీపికని కలిశా. తను ఓ స్పెషల్‌ పర్సన్‌ అని అప్పుడే నాకు అర్థం అయింది. తన రూమ్‌లోకి ఎంటర్‌ అవగానే ఒక ఎనర్జీ, కెమిస్ట్రీ కనిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల తను ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’లో యాక్ట్‌ చేయలేకపోయింది. ‘ట్రిప్లెక్స్‌’లో తనను ఎలాగైనా  క్యాస్ట్‌ చేసుకుందామని  డిసైడ్‌ అయ్యాం.‘నేను ఈ సినిమాలో యాక్ట్‌ చేయాలంటే నువ్వు ఇండియా రావాలి’ అని డీల్‌ ఫిక్స్‌ చేసిందామె. ఆ డీల్‌ ఒప్పుకొని మంచి పని చేశా. అందరూ దీపిక అందాన్ని, కామెడీ టైమింగ్‌ గురించి మాట్లాడతారు. దీపికా జస్ట్‌ స్టార్‌ మాత్రమే కాదు. యాక్టర్స్‌ యాక్టర్‌. క్రాఫ్ట్‌కి డెడికేట్‌ అయిన ఆర్టిస్ట్‌. ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని మార్కెట్స్‌కు స్టక్‌ అయిపోతుంటారు. బట్‌.. దీపిక కేవలం ఇండియాను రిప్రజెంట్‌ చేయడానికి కాదు.. ఈ ప్రపంచాన్ని రిప్రజెంట్‌ చేయడానికి వచ్చింది. భూమి మనకు అందించిన బెస్ట్‌ గిఫ్ట్‌ దీపిక’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు విన్‌ డీజిల్‌.

అలాగే ప్రియాంక స్పందిస్తూ, ‘ఈ లిస్ట్‌లో నా స్నేహితురాలు దీపికా, విరాట్‌ కొహ్లీ నిలవడం హ్యాపీగా గర్వంగా ఉంది’ అని ట్వీట్‌ చేసింది. విరాట్‌ కొహ్లీ కూడా ఈ జాబితాలో ఉన్నారు.