తెలివి తక్కువగా అతనికి రెండో అవకాశం ఇచ్చాను!

“తెలివి తక్కువగా అతనికి రెండో అవకాశం ఇచ్చాను. ఎందుకంటే, తాను నన్ను బతిమాలుకున్నాడు. అప్పటికే నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తను ఇంకా నన్ను మోసం చేస్తున్నాడని చెబుతూనే ఉన్నారు. అప్పడు నేను అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను”.. అంటూ చెప్పింది దీపిక పదుకొనే తన విఫల ప్రేమ గురించి వివరిస్తూ. దీపిక కొన్నేళ్లపాటు హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమ వ్యవహారం నడిపిన విషయం తెలిసిందే. దీపిక.. రణ్‌బీర్‌ రెండేళ్లపాటు డేటింగ్‌ చేసి..2009లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తన గత ప్రేమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది . ప్రేమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంది. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది .
 
దీపిక గతంలో తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు చెప్పింది . ఒకసారి రిలేషన్‌షిప్‌లో మోసపోతే మళ్లీ ఆ బంధాన్ని యథావిధిగా కొనసాగించలేమని చెప్పింది. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవ్వరినీ మోసం చేయలేదు. శృంగారం కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. భావోద్వేగాలతో కలిసి ఉంటుంది. ఒకవేళ నేను మూర్ఖుల మధ్య ఉన్నానని నాకు తెలిసినప్పుడు.. నేను ఎందుకు రిలేషన్‌షిప్‌లో ఉంటాను. ఒంటరిగా, ఆనందంగా ఉండటమే మంచిది కదా. అయితే అందరూ అలా ఆలోచించరు. బహుశా అందుకే నేను గతంలో బాధపడ్డాను. దాని నుంచి బయటికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. మొదటిసారి అతను నన్ను మోసం చేసినపుడు ఆ బంధంలోనో..లేదా నాలో లోపం ఉందని అనుకున్నాను, కాని ఎవరైనా మోసాన్ని అలవాటుగా చేసుకున్నప్పుడు..అతనే అసలు సమస్య అని తెలిసిపోతుంది. నేను రిలేషన్‌షిప్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కానీ తిరిగి ప్రతిఫలం ఆశించను. కానీ ఒక్కసారి రిలేషన్‌షిప్‌లో మోసం చేస్తే.. గౌరవం పోతుంది. బంధానికి ఉన్న నమ్మకం పోతుంది. ‘అతనితో కలిసి ఉండలేం’ అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్నాక. మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఏమీ లేదు. జీవిత ప్రయాణంలో ముందుకు సాగాల్సిందే’’ అంటూ దీపికా చెప్పుకొచ్చింది.
దీపిక అదిరిపోయింది !
దీపికా పదుకొనె- రణ్‌వీర్‌సింగ్‌ నిజ జీవిత జంట కలిసి నటిస్తున్న సినిమా ‘83’. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా ’83’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తుండగా.. ఆయన భార్య రోమి భాటియా(రోమి దేవ్‌) పాత్రలో దీపికా నటిస్తోంది. ఇప్పటికే ‘రామ్‌ లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావతి’ వంటి చిత్రాలలో నటించిన వీరు పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో ఈ మూవీపై మంచి ఆసక్తి ఏర్పడింది.సినిమాలో రణ్‌వీర్‌ ఫస్ట్‌ లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో తాజాగా దీపికాకు చెందిన ఫస్ట్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. కాగా ఈ లుక్‌ను చూస్తూ రోమి దేవి పాత్రలో ‘దీపిక అదిరిపోయింది’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. సినిమాలో కపిల్‌దేవ్‌, రోమి దేవ్‌ మధ్య అనుబంధం హైలెట్‌గా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు, తమిళం, తెలుగు వంటి భాషల్లోనూ ఏప్రిల్‌లో విడుదల కానుంది.