రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేది లేదు !

దీపికా పదుకొనే ఈ మధ్య ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యధిక పారితోషికం పొందుతున్న వారి జాబితాలో ప్రపంచ నటుల్లో పదో స్థానంలో నిలిచింది . హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ విన్నర్‌ జెన్నీఫర్‌ లారెన్స్‌, జూలియా రాబర్ట్‌ వంటి వారు కూడా ఈమె తర్వాతే ఉన్నారు. ఈ జాబితా ప్రకటించాక ఈమె రెమ్యునరేషన్‌ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.దీపికా ఏదైనా సినిమాకు కమిట్‌ అయితే …దాని కోసం తన సమయాన్నంతా కేటాయిస్తుంది. తనకిచ్చిన పాత్రపైనే దృష్టి కేంద్రీకరిస్తుందని టాక్‌ ఉంది. ఆమె పనికి తగినట్టే భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేస్తుందట కూడా.

దీపిక ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘పద్మావతి’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం తన సమయం అంతా ఈ చిత్రం కోసమే కేటాయిస్తుంది. అందుకు రూ.12 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసిందట. దానికి అంగీకరించే భన్సాలీ షూటింగ్‌ మొదలు పెట్టాడట. ఇందులో ఈమెతో పాటు రణవీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ కూడా ఉన్నారు. బాలీవుడ్‌ హీరోలు ఖాన్స్‌ నటించే ఓ చిత్రం కోసం దీపికాను సంప్రదిస్తే ‘పద్మావతి’ పారితోషికం ఇస్తేనే చేస్తానని మొహమాటం లేకుండా  చెప్పేసిందట.