ద్రౌపది గా చేస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా.. గౌరవంగా ఉంది

దీపికా పదుకొనె ‘ద్రౌపది’ గా కనిపించబోతున్నారు.మహాభారతంలోని ద్రౌపది కోణంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ‘బాజీరావు మస్తానీ’లో యువరాణి మస్తానీగా, ‘పద్మావత్‌’ చిత్రంలో రాణి పద్మావతీగా తనదైన అద్బుత నటనతో ఆకట్టుకున్న దీపికా పదుకొనె త్వరలో ద్రౌపదిగా కనిపించబోతున్నారు.మహాభారతంలోని ద్రౌపది కోణంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ‘మహాభారతం’లోని ద్రౌపది పాత్రలో వెండితెరపై మెరవబోతున్నట్టు దీపికా స్వయంగా తెలపడం విశేషం. ఇతిహాసగాథ అయిన మహాభారతం ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ఓ సినిమాని రూపొందించబోతున్నారు. మధు మంతెనతో కలిసి దీపికా ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. ఈ విషయాన్ని దీపికా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ…
‘ద్రౌపది పాత్రని పోషిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా, గౌరవంగా ఉంది. ద్రౌపది పాత్ర నా జీవితాంతం నిలిచిపోతుందని నమ్ముతున్నా. మహాభారతం ఒక పౌరాణిక గ్రంథంగానే మనకు తెలుసు. ప్రతి ఒక్కరికీ ఈ గ్రంథం ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. ఇది ఎక్కువగా మగవారి కోణంలోనే చూశాం. ద్రౌపది కీలక పాత్రధారిణిగా చేసుకుని మహాభారతాన్ని కొత్తగా, ఆసక్తికరంగా, అందరికి గుర్తుండి పోయేలా తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు.
‘ద్రౌపది మన సాంస్కృతిక చరిత్రలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ద్రౌపది కథను మళ్లీ వెండితెరపై చెప్పడం అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడిన పని. మహాభారతంలో ద్రౌపది ఒక్కరే హీరోయిన్‌. ఈ రోజు దీపిక కేవలం అగ్ర కథానాయికే కాదు..అనేక బారియర్స్‌ చెరిపేసిన నటి. అందువల్ల ఈమె లేకపోతే ఈ ప్రతిష్టాత్మక చిత్రం మేం నిర్మించేవాళ్లం కాదు. ఈ కథకి ఆమె బాగా సూట్‌ అవుతారు. చాలా పెద్ద స్కేల్‌లో సినిమాని నిర్మిస్తున్నాం’ …అని మరో నిర్మాత మధు మంతెన తెలిపారు. ఈ సినిమాను రెండు లేదా మూడు భాగాలుగా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందు కురానుంది. అయితే దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. దీపికా ప్రస్తుతం ‘ఛపాక్‌’, ’83’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ‘రామాయణ్‌’ చిత్రంలో కూడా సీతగా నటించబోతున్నట్టు చెప్పుకుంటున్నారు .