రణవీర్‌కు దీపిక మూడు నిబంధనలు !

రణవీర్‌సింగ్ దీపికా పదుకొనే… ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ రణవీర్‌ సింగ్‌, దీపిక పదుకొనే ఇప్పటికీ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా దీపికకు సంబంధించిన రణవీర్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి ముందు రణవీర్‌కు బాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్‌ ఉంది. ఎప్పుడై లేట్‌ నైట్‌ పార్ట్సీ, ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్‌ చేయటం రణవీర్‌కు అలవాటు. అయితే పెళ్లి తరువాత అలాంటివి కుదరదంటూ షరతులు పెట్టిందట దీపిక.ఆరేళ్లపాటు ప్రేమాయణం అనంతరం రణవీర్‌సింగ్, దీపికా పడుకొనేలు ఇటీవల ఇటలీలోని లేక్‌కామో వద్ద విల్లా డెల్‌బాల్బీనియోలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. పెళ్లి అనంతరం తన భార్య దీపికా తనకు మూడు విషయాల్లో నిషేధం విధించిందని రణవీర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని కాబట్టి ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండలేనని… దీనిపై దీపిక నిషేధం విధించిందన్నారు. రోజూ ఇంటికి ఆలస్యంగా రావడం, ఏమీ తినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడం, ఫోన్ కాల్ చేసినపుడు ఆన్సర్ చేయకుండా ఉండటం లాంటి విషయాలపై దీపిక తనకు నిషేధం విధించిందని రణవీర్ వెల్లడించారు.

తెరపై గ్లామరస్ గా కనిపించే దీపిక తనకి ఇంకా ఎంతో అందంగా కనిపిస్తుందని రణవీర్ తన భార్య గురించి ప్రశంసలు కురిపించారు… ‘‘నా భార్య దీపిక నిద్రపోతున్నప్పుడు, ఆమె మేల్కొన్నప్పుడు, రోజు మధ్యలోనూ ఆమె బ్రహ్మాండంగా ఎంతో అందంగా కనిపిస్తుంది’’ అని రణవీర్ చెప్పారు.మనకు తెరపై చూస్తే ఆకర్షణీయంగా కనిపించే దీపిక ఇంట్లో అద్భుత, ఆదర్శ గృహిణిగా తన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతుందని రణవీర్ పేర్కొన్నారు. అందుకే తాను దీపికను అంతలా ప్రేమిస్తూ ఉంటానని రణవీర్‌సింగ్ వివరించారు.ఇప్పటికే రణవీర్‌ను దీపిక డామినేట్‌ చేస్తుందన్న వార్తలు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్న సమయంలో రణవీర్ చెప్పిన కండిషన్స్ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.