కొందరు నాకు దూరంగా వెళ్లిపోతున్నారు !

”చాలాకాలంగా రొమాంటిక్‌ సంబంధాలు ఆందోళనకరంగా, క్లిష్టంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకరి విజయాన్ని, అభిరుచిని, చేసే పనిని, ఒక వేళ ఆ వ్యక్తికంటే ఎక్కువ మొత్తంలో సంపాధించినా …ఆ విషయం అర్ధం చేసుకోగల భాగస్వామిని గుర్తించడం చాలా కష్టం…అని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ‘పద్మావతి’ చిత్రం షూటింగ్‌లో ఉన్న బాలీవుడ్‌ ప్రముఖ నటి దీపికా పదుకునే మీడియాతో మాట్లాడుతూ ….. భద్రతనిచ్చే రొమాంటిక్‌ పార్టనర్‌ను గుర్తించడం చాలా కష్టమని ఆమె అన్నారు. విజయాన్ని, పేషన్‌ను అర్థం చేసుకునే భాగస్వామిని గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య అని అభిప్రాయపడ్డారు.

ఇక నా విషయానికొస్తే నా వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని బలంగా ఉండేవి.. కానీ, ఇటీవల వాళ్లలో కొందరు నాకు దూరంగా వెళ్లిపోతున్నారు. నా స్కూల్‌ స్నేహితుల్లో కొంతమందికి నేను బాగా దగ్గరయ్యాను. ఎందుకంటే మేం ఎప్పటికప్పుడు ఒకరికొకరం టచ్‌లోనే ఉంటున్నాం. కొంతమందికి విజయం వచ్చినప్పుడు …దానిని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియడం లేదు. ఆ విజయం కొంతమందిని దూరం చేస్తుంది కూడా. అయితే, నేను అలాంటి సందర్భాల్లో నిరుత్సాహానికి గురికాలేదు. ఎందుకంటే అవన్నీ జీవిన పయనంలో ఒకభాగం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

చైతన్యం నింపేందుకు’ లివ్‌ లవ్‌ లాఫ్‌’  ఫౌండేషన్

ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకోణె తన పెద్దమనసు చాటుకున్నారు. దావణగెరె జిల్లాలో పర్యటించిన ఆమె దావణగెరె జిల్లా జగళూరు తాలూకా పల్లాగట్టె, బిళిచోడు గ్రామాల్లో మానసికంగా అనారోగ్యానికి గురైన చిన్నారులను పరామర్శించారు. మానసిక అనారోగ్యంపై ప్రజలలో చైతన్యం నింపేందుకు తాను స్థాపించిన ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించారు. ఆయా గ్రామాలు, తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

రోగులు పడుతున్న ఇబ్బందులు గమనించి తన వంతు సాయం చేశారు. ఏడీపీ సంస్థ తరఫున దీపికా పదుకోణె మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం నింపి, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఆమె స్వచ్ఛందంగా ముందుకు కదిలారు.  “మానసిక రోగులపై చొరవ తీసుకుని వారిని మామూలు స్థితికి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషి చేస్తా'”నన్నారు.దీపికా పదుకొణె ఆయా గ్రామాల్లో పర్యటించడంతో ఆమెను చూడటానికి జనం ఎగబడ్డారు. గ్రామాల్లో పర్యటించిన అనంతరం దావణగెరెలోని ఓ హోటల్‌కి చేరుకోవడంతో అక్కడ కూడా భారీ ఎత్తున జనం చేరి ఆమెను చూసేందుకు పోటీ పడ్డారు.