విడుదలకి ముందే దీపిక ‘ప‌ద్మావ‌తి’ హ‌వా !

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ పద్మావతి. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపిక పదుకొణే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప‌లు వివాదాలలే ఈ చిత్రంకి మంచి ప్ర‌మోష‌న్స్ గా మారాయి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి భారీ స్పందన వ‌చ్చింది. ట్రైల‌ర్‌ని బ‌ట్టే సినిమాని ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఇక రిలీజ్‌కి ముందే సినిమా బిజినెస్ కూడా భారీగా జ‌రుపుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా రూ.25 కోట్లు పెట్టి ‘పద్మావతి’ డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.200 కోట్ల దాకా పలుకుతున్నట్లు సమాచారం. మిగతా హక్కులన్నీ కలిపి కనీసం రూ.50 కోట్లు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి. అంటే సినిమా రిలీజ్‌కి ముందే ప‌ద్మావ‌తి హ‌వా ఈ విధంగా కొన‌సాగుతుంటే , రిలీజ్ త‌ర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ !

సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ మూవీని ఏ టైమ్‌లో మొదలుపెట్టాడోగానీ.. అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. షూటింగ్‌కు కూడా చాలాసార్లు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడేలా ఉంది. ముఖ్యంగా గుజరాత్‌లో ఈ మూవీ రిలీజ్‌ను వాయిదా వేయాలని అధికార బీజేపీ డిమాండ్ చేస్తున్నది. సినిమా రిలీజ్ అయ్యే వారంలోనే గుజరాత్‌లో ఎన్నికల జరగనున్నాయి. ఇదే సమయంలో సినిమాపై మండిపడుతున్న రాజ్‌పుత్‌ల సెంటిమెంట్ దెబ్బ తింటే అది ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని బీజేపీ వాదిస్తున్నది. దీనిని నివారించడానికి సినిమా రిలీజ్ అయ్యే ముందే కొందరు రాజ్‌పుత్ కమ్యూనిటీ సభ్యులకు సినిమా చూపించే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం, గుజరాత్ ఎన్నికల కమిషనర్‌కు లేఖలు రాసింది బీజేపీ. ”పద్మావతి సినిమాపై నిషేధమైనా విధించండి లేదా రిలీజ్‌ను వాయిదా వేయండి’ …అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఐకే జడేజా డిమాండ్ చేశారు. డిసెంబర్ 1న పద్మావతి రిలీజ్ కానుండగా.. డిసెంబర్ 9, 14న రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సినిమాలో రాణి పద్మిణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమాయణం ఉందన్న అనుమానాల మధ్య మొదటి నుంచీ రాజ్‌పుత్‌లు అడ్డుపడుతూనే ఉన్నారు.