క్రేజ్ తగ్గాక కాంప్రమైజ్ కాకపోతే కష్టమే !

 మాధవన్‌ ‘ఇరుంది సుట్రు’ (తెలుగు లో వెంకటేష్ ‘గురు’), ‘విక్రమ్ వేదా’తమిళ్ లో బాగానే ఆడాయి.  ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరో స్టేటస్ ఎంజాయ్ చేసిన మాధవన్‌కు ఇప్పుడు సోలో హీరోగా మార్కెట్ లేదు. అయితే కొన్ని పాత్రలకు మాధవన్‌ను ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్‌గా భావిస్తున్నారు కొందరు   దర్శకనిర్మాతలు. అలా మాధవన్ బిజీ స్టార్‌గానే కొనసాగుతున్నాడు. తమిళంలో మాధవన్‌కు ఇలాంటి అవకాశాలకు డోకా లేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి ఆఫర్లు మాధవన్ తలుపు తడుతున్నాయి.అయితే క్రేజ్ తగ్గిన హీరోలు వచ్చిన అవకాశాలను అస్సలు మిస్ చేసుకోరు. కానీ ఆ కోలీవుడ్ హీరో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడట…..
 అలా రీసెంట్‌గా ‘ఫన్నీ ఖాన్’ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న మాధవన్, ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఛాన్స్ వదులుకున్నాడని వినిపించింది. అయితే ఐశ్వర్యరాయ్ సరసన రొమాన్స్ చేసే అవకాశాన్ని మాధవన్ మిస్ చేసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన మాధవన్, 15 రోజుల షూటింగ్ కోసం ఏకంగా కోటిన్నర డిమాండ్ చేశాడట.సినిమాను తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయాలని భావించిన నిర్మాతలు మాధవన్‌కు అంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించలేదట. దీంతో మాధవన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఆ ప్లేస్‌లోకి నటుడు రాజ్ కుమార్‌రావు రావడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు ఈ పాత్ర కోసం మలయాళ అప్ కమింగ్ స్టార్ అదిల్ ఇబ్రహీంను ఎంపిక చేయాలని దర్శకనిర్మాతలు భావించారట.. అయితే అందుకు ఐష్ ఒప్పుకోలేదని సమాచారం. అవకాశాలు తగ్గుతున్నా రెమ్యూనరేషన్ విషయంలో మాధవన్ కాంప్రమైజ్ కాకపోవడం వల్ల ఇలాంటి ఛాన్స్‌లు మిస్ చేసుకుంటున్నాడు