460 కోట్ల వ్యూస్ సాధించిన తొలి వీడియో ‘డెస్పాసిటో’

300 కోట్లకుపైగా వ్యూస్‌తో ‘డెస్పాసిటో’ సాంగ్ రికార్డులు తిరగరాస్తోంది. యూట్యూబ్‌లో ఈ  వీడియో సంచలనాలు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన వీడియోగా రికార్డు నెలకొల్పిన ‘విజ్ ఖలీఫా – సీ యూ ఎగైన్’ను ‘డెస్పాసిటో’ అధిగమించింది. స్పానిష్‌ భాషలో చిత్రీకరించిన ఈ పాటను ఈ ఏడాది జనవరి 12న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. ఏడు నెలల వ్యవధిలోనే 300 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2012లో వచ్చిన ‘గంగ్నమ్ స్టైల్’ వీడియోను ‘సీ యూ ఎగైన్..’ అధిగమించి కొద్ది రోజుల క్రితం వరకు టాప్ పొజిషన్లో నిలిచింది. ప్యూర్టోరికో సింగర్ పోస్ట్ చేసిన ‘డెస్పాసిటో’ ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టింది. జస్టిన్ బీబర్ ఈ వీడియోలో తళుక్కుమనడం ప్లస్‌గా మారింది. అన్ని ఫ్లాట్‌ఫామ్‌లు కలుపుకొని 460 కోట్ల వ్యూస్ సాధించిన తొలి వీడియోగా ‘డెస్పాసిటో’ రికార్డు క్రియేట్ చేసింది. లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీ నటించిన ఈ వీడియో సాంగ్‌ను జస్టిన్ బీబర్ పాడారు. యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన వీడియోగా సరికొత్త రికార్డులు నెలకొల్పిన వీడియోపై ఓసారి మీరు కూడా లుక్కేయండి…. https://www.youtube.com/watch?v=kJQP7kiw5Fk