దేవరాజ్ హీరో గా ‘బుల్లెట్ సత్యం’ టైటిల్, సాంగ్ లాంచ్!

దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో,హీరోయిన్ లుగా మదుగోపు దర్శకత్వంలో సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్ నిర్మిస్తున్న ‘బుల్లెట్ సత్యం’ చిత్రం టైటిల్, లిరికల్ వీడియో సాంగ్  ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి ,డైరెక్టర్ వీర శంకర్,దేవి ప్రసాద్,సంజయ్ రెడ్డి  లిరికల్ సాంగ్ విడుదల చేసారు.

చిత్ర నిర్మాత, హీరో దేవరాజ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం యొక్క  కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ సాగుతుంది..నేను ఈ చిత్రం లో మొదటిసారిగా హీరో గా నటించాను.మీరందరూ నన్ను ఆదరించి ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ.. బుల్లెట్ సత్యం సాంగ్స్ పాటలు జనాల్లోకి బుల్లెట్ లాగా దూసుకు పోతున్నాయి.పాటల్లాగే.సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
పాటల రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో  అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.ఇందులో.ప్రతి పాట సందర్భానుసారంగా వచ్చాయి..ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని” కోరుకుంటున్నాను.

దర్శకుడు మధు మాట్లాడుతూ.. “ఇది నాకు రెండవ చిత్రం..విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఈ చిత్రం లోని సాంగ్స్ అన్ని బాగుంటాయి..వచ్చే నెల సినిమా థియేటర్లు ఓపెన్ అయితే గ్రాండ్ రిలీజ్ చేద్దామని చూస్తున్నాము..లేదా att ద్వారా రిలీజ్ చేద్దామని” అనుకుంటున్నాము. ఈ చిత్రం ఎక్కడా కూడా సినిమా టిక్ గా ఉండదు..రియాలిస్టిక్ గా ఉంటుంది..ఈ చిత్రం లో హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు..ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు..

దేవరాజ్, సోనాక్షి వర్మ,వినోద్ కుమార్,మోనా తాకుర్, సంజయ్ రెడ్డి,చంటి,ధన్ రాజ్,అప్పారావు,శివ లీల,సత్తెన్న,వాసు,రాకేష్,చేతన్ నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : పోతూరి పవిత్ర,డి ఓ పి. : G. L. బాబు, ఎడిటర్ : S. B.ఉద్ధవ్, రచన-సహకారం : సంజయ్ బంగారపు

Final Song MP4 (For Channels)…

https://wetransfer.com/downloads/09a2f7eb2787e7cfe671f6239eb571e920201125063848/e332b1f479cbfb754d8a8ea90ccef4ab20201125063903/b36c51