దేవరాజ్ ‘బుల్లెట్ సత్యం’ ట్రైలర్ విడుదల !

దేవరాజ్,సోనాక్షి వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘బుల్లెట్ సత్యం’ చిత్రం ఈ నెల 10 న విడుదల ఆవుతున్న సందర్భంగా ట్రైలర్ ను సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ప్రసాద్ వర్మ ,యస్ ఆర్. కళ్యాణ మండపం బ్యానర్ శంకర్,దర్శకుడు అభిలాష్ రెడ్డి, కమెడియన్ చలాకీ, కమెడియన్ ధనరాజ్ తదితరులు హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేయగా… సీనియర్ నటుడు వినోద్ కుమార్ “బుల్లెట్ సత్యం” ట్రైలర్ ను విడుదల చేశారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ‘బుల్లెట్ సత్యం’  దేవరాజ్ కు మొదటి సినిమా అయినా హీరోగా చేస్తూ నిర్మాతగా ఈ సినిమా ఎలా తీయాలని చక్కగా ప్లాన్ చేసుకొని తీశాడు..విల్లేజ్ నేటివిటీ లో వస్తున్న ఈ చిత్రంలో నేను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్ర చేశాను.  ఫ్యామిలీ ఓరియెంటెడ్, పొలిటికల్ క్రైమ్,థ్రిల్లర్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న డీఫ్రెంట్ సినిమా ఇది. దర్శకుడు నిజామాబాద్ ను రాజమండ్రి లా చూపించాడు.ఈ నెల 10 న విడుదల అవుతున్న ఈ సినిమా బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు
హీరో, నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ… వినోద్ కుమార్ ఈ సినిమాలో నటించడం మాకు పెద్ద అసెట్.ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో ఉన్న అన్ని పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాంబాబు మంచి పాటలు రాశారు. యాజమాన్య మంచి సంగీతం అందించారు. సినిమా రియాలిస్టిక్ గా ఉంటుంది. మొదటిసారిగా నేను హీరో గా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నా కేంతో సపోర్టు చేశారు అని అన్నారు.
చిత్ర దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ.. ఇది పూర్తి విల్లేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ .ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక విలేజ్ లో ఉండే ఎంపిటిసి పోస్ట్ కోసం ఎలా పరితపిస్తారు.ఆ ఎంపిటిసి అవ్వడం కోసం తను లైఫ్ లో ఏం కోల్పోయాడు. ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే కథ. దేవరాజ్ గారు కరోనా టైం లో కూడా ముందుకు వచ్చి చిత్రాన్ని నిర్మించడమే కాక హీరోగా నటించారు. ఫ్యూచర్ లో మంచి యాక్టర్ అవుతాడు అని అన్నారు.
లక్ష్మీ నారాయణ ప్రెజెంట్స్ సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై నిర్మించిన ఈ చిత్రానికి
నిర్మాత.. పోతూరి పవిత్ర, డి ఓ పి..G. L. బాబు, ఎడిటర్..S. B. ఉద్ధవ్, రచన-సహకారం..సంజయ్ బంగారపు