ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాష్ రెడ్డి ‘అలెగ్జాండర్’

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘అలెగ్జాండర్’. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ..ఎన్నో విలక్షణమైన పాత్రలతో.. లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఈయన హీరోగా ‘అలెగ్జాండర్’ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ధవళ సత్యం. ‘ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో ఆయన ఒక్కరే నటిస్తుండటం విశేషం. అలెగ్జాండర్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు నిర్మాతలు. జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.