దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా అయన స్వీయ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం “దిక్సూచి”.. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పిస్తుండగా శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగ సినిమా పై మంచి ఆసక్తిని కలిగించింది.. ఏప్రిల్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. కాగా ఈ చిత్ర ఆడియో ని ‘దిక్సూచి మ్యూజిక్’ అనే యాప్ ద్వారా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. హైదరాబాద్ లో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి చిత్రబృందం హాజరైంది..
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో దిలీప్‌కుమార్ సల్వాది మాట్లాడుతూ..దిక్సూచి చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో సెమీ పీరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది.. థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతో పాటు అన్నిరకాల ఎమోషన్స్ ఈ సినిమా లో ఉన్నాయి.. రెండు గంటలు మిమ్మల్ని తప్పకుండా ఆనందింపచేస్తుంది..ఉగాది రోజు ఇదే బ్యానర్ లో ఇంకో సినిమా చేస్తున్నాం.. మళ్ళీ నాకు అవకాశమిచ్చిన ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్ర ఆడియో ని రిలీజ్ చేశాక ఎవరికీ సాంగ్స్ ని ఇవ్వలేదు.. మేమె ఓన్ గా రిలీజ్ చేయాలనీ ‘దిక్సూచి మ్యూజిక్’ అనే యాప్ ని క్రియేట్ చేసి ఈ యాప్ ద్వారా ఈ సినిమా ఆడియో ని రిలీజ్ చేస్తున్నాం.. ఈ యాప్ ద్వారా ఫ్యూచర్ లో మరిన్ని సినిమా సాంగ్స్ ని రిలీజ్ చేయబోతున్నాం..
ఎక్కడికి వెళ్లిన సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.. ఇటీవలే ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ కి మా టీం వెళ్లగా అక్కడ కూడా ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది..అక్కడి ప్రేక్షకులు ట్రైలర్ బాగుంది అంటూ మంచి ప్రోత్సాహమిచ్చారు.. అక్కడివారు కూడా తెలుగులో సినిమా లు నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి సిద్ధం చేస్తున్నాం.. దాని పేరు ‘రైన్ బో కార్పెట్ షో’ గా నిర్ణయించాం..ఈ ఈవెంట్ కి కామన్ ఆడియెన్స్ వచ్చి ఈ సినిమా ను చూసి వారే ఈ సినిమా ఎలా ఉంది అని టీవీ ఇంటర్వ్యూ ల్లో చెప్తారు. ఇంతవరకు ఇలాంటి ప్రమోషన్ ఎవరు చేయలేదు..ఏప్రిల్ మూడో వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం అన్నారు..
నిర్మాత నరసింహ రాజు రాచూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ ఉన్న చిత్రం.. ఇందులో ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు లేవు, కథ నచ్చి చేసిన సినిమా ఇది.. అందుకే ఈ సినిమా ని నిర్మించాను.. ఈ సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది.. ఒక మంచి సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్లాలనేదే నా తాపత్రయం.. ఈ సినిమా ని ఆదరించి హిట్ చేయాలి అని కోరుతున్నాను అన్నారు..
నటుడు అరుణ్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చి చాల బాగా ఎంకరేజ్ చేశారు.. ఒక సామాన్యుడిగా దిలీప్ ఈ సినిమా చేశాడు, రేపు అయన అసామాన్యుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను.. అలాగే ప్రొడ్యూసర్ గారికి సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను.. ఈ సినిమా లో కొత్త నటీనటులు చాల మంది నటించారు.. ఈ సినిమా విజయం మా అందరికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నాను..సినిమా కథ లో బలం ఉంది.. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి.. అందరు ఈ సినిమా ని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను..
దిలీప్‌కుమార్ సల్వాది, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక , బిత్తిరి సత్తి , రాకేష్ , మల్లాది భాస్కర్ , సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, ధన్వి నటించిన ఈ చిత్రానికి దర్శకత్వంఃదిలీప్ కుమార్ సల్వాది, ప్రొడ్యూసర్స్ఃనర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల, కెమెరాఃజయకృష్ణ, రవికొమ్మి, మ్యూజిక్ డైరెక్టర్ః పద్మనాభ్ భరద్వాజ్, లిరిక్స్ః శ్రీరామ్ తపస్వీ, స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ః దిలీప్‌కుమార్ సల్వాది