దిల్ రాజు ద్వారా సెప్టెంబర్ 2న `వెళ్ళిపోమాకే` విడుదల !

 హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన `వెళ్ళిపోమాకే` చిత్రాన్ని దిల్ రాజు  విడుదల చేస్తున్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ -`వెళ్ళిపోమాకే  సినిమా మేకింగ్ చాలా బాగా న‌చ్చింది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి తగిన విధంగా నటీనటులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు.

విశ్వక్ సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య సాగే ఫీల్ గుడ్ మూవీ యాకూబ్ అండ్ టీం క‌లిసి, కొత్త‌గా చేసిన ప్ర‌య‌త్నమే `వెళ్ళిపోమాకే` . దర్శకుడు న‌టీన‌టుల నుండి పెర్‌ఫార్మెన్స్‌ ను రాబ‌ట్టుకున్న తీరు బాగా న‌చ్చింది.హీరో విశ్వ‌క్ సేన్ అనుప‌మ్ ఖేర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడు. అలాగే డైరెక్ట‌ర్ యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు.  మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ స్కూల్‌లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడు. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ తో వ‌స్తున్న యంగ్ టీంను ఎంక‌రేజ్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వస్తాయి. సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాము` అన్నారు.

ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండున్న‌ర సంవ‌త్స‌రాల క్రిత‌మే స్టార్ట్ చేశాం. నాకున్న బ‌డ్జెట్ ప‌రిమితుల్లో, వ‌న‌రుల‌తో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా న‌చ్చి దిల్‌ రాజుగారు సినిమాను విడుద‌ల చేద్దామ‌నే ఉద్దేశంతో ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.

Dil Raju to release Vellipomakey on Sep 2nd

The ace producer of Telugu cinema, Dil Raju, is known to often support new talent be it actors, directors or technicians. Yet again, he is going all out to encourage the team of the independent film Vellipomakey. Directed by newcomer Yakub Ali, the film is being released by Dil Raju in both the Telugu states on September 2, 2017.

Speaking about the same, he shares: “I loved the making of this film. It’s a feel good love story and director Yakub Ali has made it very well. In fact, the actors in the film have performed quite brilliantly too. A story that transpires between Vishwak Sen and a few other actors, this is a very new attempt from director Yakub Ali and team. Vishwak has in fact trained in acting from the renowned institute run by actor Anupam Kher. Yakub Ali has studied filmmaking at the prestigious Ramanaidu Film School. The film’s music director Prashanth Vihari has been trained from A.R. Rahman’s music institute in Chennai. With the hope that encouraging a small film like this with extremely talented people will be an inspiration to many more younger filmmakers, we are releasing the film on September 2.”

 

Yakub Ali, the film’s director shares, “We started this film 2 and a half years ago. I gave this film my everything within the budget limitations that I had. And it’s a boost for the whole team that someone like Dil Raju garu not only liked the film but also is releasing it under his banner. I am very happy.”