‘గమ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) అనతికాలంలోనే మంచి అభిరుచి గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతాకర్ణి చిత్రాలతో తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మి భాయి జీవితకథ ఆధారంగా ‘మణికర్ణిక’ అనే మూవీ తీస్తున్నాడు.బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ జీవిత కధా చిత్రానికి కూడా క్రిష్ దర్శకుడు.ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం కొంత ఒడిదుడుకులకు లోనవుతోందని తెలుస్తోంది.
ఇదిలాఉండగా క్రిష్ తన సతీమణి రమ్యకు విడాకులు ఇవ్వనున్నాడనే వార్త ఇప్పుడు సినీపరిశ్రమలో తెగ హల్‌చల్ చేస్తోంది. 2016, ఆగస్టు 7న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు క్రిష్. అయితే పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం టాలీవుడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా డిఫరెన్సెస్ వచ్చాయని.. దీంతో వారిద్దరూ విడిపోవాలని భావించినట్టు వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల నిర్ణయం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అయితే వీరిద్దరు ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ… పరస్పర అంగీకారం తోనే విడిపోవాలని భావిస్తున్నట్టు సమాచారం.