ఆ సినిమా తర్వాత మూడు నుండి ఐదుకెళ్ళింది !

‘లోఫర్’ దిశా పటానీకి అంతగా వర్కవుట్ కాకపోవడంతో బాలీవుడ్‌కు షిఫ్టయిపోయింది. ‘యమ్.యస్.ధోనీ’ ,’కుంగ్ఫూ యోగా’, ‘వెల్కమ్ టు న్యూయార్క్’ లాంటి చిత్రాల్లో తన ట్రేడ్ మార్క్ అందచందాల్ని ప్రదర్శించి అక్కడ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా ‘బాఘీ-2’తో ఈ చిన్నది బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అయ్యింది…
 
సి.సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ ‘సంఘమిత్ర’ లో దిశా హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య లాంటి హీరోలు నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను శ్రుతి హాసన్ హీరోయిన్‌గా ఎనౌన్స్ చేశారు నిర్మాతలు. అయితే ఆమెతో అభిప్రాయ భేదాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ దిశా పటానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే దిశా ఈ సినిమాను అంత తేలిగ్గా అంగీకరించలేదు. దానికోసం ఆమె 3 కోట్ల వరకూ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. నిర్మాతలూ దానికి అంగీకరించారు. అయితే మొన్నటి వరకు బాగానే ఉన్న అమ్మడు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని డేట్స్ క్లాష్ అవుతాయనే వంకతో ఇంకో రెండు కోట్లు పెంచేసిందట. మొత్తం 5 కోట్లకు టార్గెట్ పెట్టేసరికి చిత్ర యూనిట్ కూడా ఏమి అనలేని పరిస్థితి. 
యూత్‌ని ఆకర్షించాలంటే అవే చేయాలి !
“నా వరకూ యాక్షన్‌ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం”…  అని అంటోంది ‘భాగీ’ భామ దిశా పటాని. అవి ఎక్కువగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌వే అయ్యుంటాయి. నా వయస్సులో అవి ఇప్పుడే చేయలేను. దానికి ఇంకా సమయముంది. ఇక నాకున్న రెండో ఛాయిస్‌ రొమాంటిక్‌ సినిమాలు. యూత్‌ని ఆకర్షించాలంటే అలాంటి సినిమాలే చేయాలి. రిపీటెడ్‌ ఆడియన్స్‌ వారే ఉంటారు కనుక, అలాంటి సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాను. హర్రర్‌ సినిమాలన్నా ఇష్టమే! జనాల్ని భయపెట్టాలని అనుకుంటూ ఉంటాను. ఇంత వరకూ ఆ అవకాశం నాకు రాలేదు.స్త్రీలనగానే యాక్షన్‌ సన్నివేశాలకు పనికిరారు అన్న అభిప్రాయం మనలో చాలామందిలో ఉంది. ఈ కారణంగానే అలాంటి సినిమాలు చాలాతక్కువగా వస్తున్నాయని నా అభిప్రాయం. హీరోలతో సమానంగా ఫైట్లు చేయగల సత్తా అమ్మాయిలకూ ఉంది.