విజయవంతం గా ‘డా.అక్కినేని నాటక కళాపరిషత్’ 23వ నాటకపోటీలు

‘డా.అక్కినేని నాగేశ్వరరావు నాటకకళాపరిషత్’  23వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటకపోటీలు తొలిసారి  విజయవాడలో విజయవంతంగా జరిగాయి. సారిపల్లి కొండలరావు  సారధ్యం లో, ‘యువకళావాహిని’ వై.కె .నాగేశ్వరరావు  అధ్వర్యం లో విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో సెప్టెంబర్ 24 నుండి మూడు రోజుల పాటు జరిగిన  పోటీల్లో తొమ్మిది నాటికలు పాల్గొన్నాయి . డా .’అక్కినేని జీవన  సాఫల్య పురస్కారాలు’ ప్రఖ్యాత  రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు , ప్రముఖ నటి కవితలకు ప్రదానం చేసారు . రంగస్ధల ప్రముఖులు నాయుడుగోపి, కోటశంకరరావు, కె ఆర్ కె మూర్తి, బాదంగీర్ సాయి గార్లకు ‘డా .అక్కినేని రంగస్థల పురస్కారాలు’ప్రదానం చేయడంజరిగింది. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు .